Auto Drivers ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం..

తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్‌ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్‌ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 02:06 PMLast Updated on: Dec 23, 2023 | 2:06 PM

Good News For Auto Drivers Cm Revanths Sensational Decision

 

తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్‌ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్‌ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది. ఆఫీసులకు తొందరగా వెళ్లేందుకు కొందరు, బస్‌లలో రష్‌ను తప్పించుకునేందుకు కొందరు.. ఇలా ఆటోలు ప్రిఫర్‌ చేస్తుంటారు. కానీ ఇప్పుడు బస్‌ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది బస్‌లలోనే వెళ్లిపోతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. మహాలక్ష్మీ పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు.

మహిళలకు ఫ్రీ బస్‌ ఇవ్వడం మంచిదే కానీ.. తమకు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఆటో డ్రైవర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది అనే విషయాన్ని అధికారులతో ఇప్పటికే ఆయన చర్చించినట్టు సమచారం. అంతేకాదు.. ఆటో డ్రైవర్లు, ఉబర్‌, ఓలా డ్రైవర్ల యూనియన్‌లతో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చర్చలు జరపబోతున్నారు. ఈ మీటింగ్‌లో డ్రైవర్ల డిమాండ్లను స్వయంగా విని.. దానికి తగ్గట్టుగా అందరికీ లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ మీటింగ్‌ తరువాత ఆటో డ్రైవర్లకు గుడ్‌ వచ్చే చాన్స్‌ ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి సీఎం రేవంత్‌ డ్రైవర్లకు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వబోతున్నారో చూడాలి.