భారత్ కు గుడ్ న్యూస్, పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో బూమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో బూమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే హిట్ మ్యాచ్ ను జట్టుతో చేరనున్నాడు. భార్య రితిక ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వడంతో స్వదేశంలోనే ఉండిపోయిన రోహిత్ పెర్త్ టెస్ట్ మూడోరోజు జట్టుతో కలుస్తాడు. నవంబర్ 24న రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు మూడో రోజు ఆట సమయానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే తొలి టెస్ట్ తర్వాత కాన్‌బెర్రాలో ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా రోహిత్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.