భారత్ కు గుడ్ న్యూస్ నెట్స్ లో షమీ బౌలింగ్

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తీవ్రంగానే కష్టపడుతున్నాడు. ఫిట్ నెస్ సాధించేందుకు బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో చెమటోడుస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 01:10 PMLast Updated on: Oct 22, 2024 | 1:10 PM

Good News For India Shami Bowling In The Nets

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తీవ్రంగానే కష్టపడుతున్నాడు. ఫిట్ నెస్ సాధించేందుకు బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో చెమటోడుస్తున్నాడు. తాజాగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కు బౌలింగ్ వేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. చూస్తుంటే షమీ వేగంగా కోలుకొని త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తునాయి. అభిషేక్ నాయర్ తో పాటు తొలి టెస్టుకు దూరమైన గిల్ కు షమీ నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. 10 నెలల పాటు గాయంతో దూరమైన ఈ సీనియర్ పేసర్ ప్రస్తుతం ఆసీస్ టూర్ సమయానికి కోలుకుంటాడని భారత్ ఆశిస్తోంది.