Good news Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. మళ్ళీ తగ్గిన చికెన్
నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగి వచ్చిన చికెన్ ధరలు.. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతు పోతున్న చికెన్ ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. రోజురోజుకు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగి వచ్చిన చికెన్ ధరలు.. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతు పోతున్న చికెన్ ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. రోజురోజుకు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేన అందులో అది కార్తీక మాసం ఒక్కసారిగా చికెన్ ధర సగంకు పడిపోయింది. దీంతో ప్రస్తుతం kg చికెన్ రూ. 150, స్కిన్ లెస్ రూ. 170కి పడిపోయింది. కాగా ఈరోజు మరో రూ. 20 తగ్గింది. స్కిన్ లెస్ రూ. 145 నడుస్తుంది. వ్యాపారులు సమాచారం మేరకు.. చికెన్ ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుత్తున్నారు. కాగా గత నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.
సరిగ్గా సంవత్సరం కిందటి వరకు.. దేశ వ్యాప్తంగా చికెన్ తినే వారి సంఖ్య విపరితంగా పెరిగిపోయింది. కారణం.. పెరిగిపోయింది. కారణం.. కరోనా ఎఫెక్ట్..కరోనా నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు.. చాలా మంది వారంలో రెండుసార్లు చికెన్ తినడం అలవాటు చేసుకున్నారు. ఈ సమయంలో kg చికెన్ రూ. 300కు పైమాటే అయిన ప్రజలు కోసారు.
చికెన్ ధరలు తగ్గడానికి గల కారణాలు :
కోళ్ల ఫారం లో కోళ్లు త్వరత్వరగా పెరుగుతాయి. ఎక్కువ బరువు పెరిగితే ఆ కోళ్లు కూడా ఆనారోగ్యం పాలవుతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే.. ఒక వైపు వర్షాలు.. మరో వైపు చలి దీంతో కోళ్లకు త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. దీంతో వాటి ధరలు మార్కెట్ లో పడిపోతున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కాగా కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.