బెజవాడ వాసులకు గుడ్ న్యూస్
విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆకుకూరలు లాంటివి కేవలం 2 రూపాయలు, 15 రూపాయలు అమ్మే వాటిని ఐదు రూపాయలు, 30 రూపాయలు, ఆపై అమ్మే కూరగాయలను కేవలం 10 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆకుకూరలు లాంటివి కేవలం 2 రూపాయలు, 15 రూపాయలు అమ్మే వాటిని ఐదు రూపాయలు, 30 రూపాయలు, ఆపై అమ్మే కూరగాయలను కేవలం 10 రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయలు అన్నింటినీ డంప్ చేసి నామ మాత్రపు ధరకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అలాగే నిత్యావసర సరుకులను కుడా తక్కువ ధరకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక పాల ప్యాకెట్ లు మంచి నీళ్ళను రెండు రోజుల పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బియ్యం సహా మరికొన్ని సరుకులను రేషన్ డీలర్ల ద్వారా ఇంటిఇంటికి సరఫరా చేసే ప్లాన్ చేస్తోంది సర్కార్. మరో వైపు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురదను తొలగించే కార్యక్రమాలను వేగవంతం చేసారు.