Tirumala Srivari Darshan Tickets : తిరుమల భక్తులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల.
ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

Good news for Tirumala devotees..Shrivari darshan tickets schedule release from today..
తిరుపతి: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,569 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.58 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక స్వామివారికి 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్..
- శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
- ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం. గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల
- చేస్తారు.వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
- తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.