ఏపీలో మందుబాబులకు మంచి రోజులు
రాష్ట్రం త్వరలో తీసుకురానున్న లిక్కర్ పాలసీ పై కసరత్తు తుదిదశకు చేరింది. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
రాష్ట్రం త్వరలో తీసుకురానున్న లిక్కర్ పాలసీ పై కసరత్తు తుదిదశకు చేరింది. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ లతో కూడిన సబ్ కమిటీ… లిక్కర్ పాలసీపై ఓ నిర్ణయం తీసుకుంది.
ఎల్లుండి 17 వ తేదీ సబ్ కమిటీ తుది సమావేశం జరుగుతుంది. 18 న కేబినెట్ ముందుకు కొత్త లిక్కర్ పాలసీ రానుంది. ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలించారు. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉంచాలని మంత్రుల బృందం తీర్మానించింది. 18 న కేబినెట్ ఆమోదం తర్వాత ఆరోజే నూతన పాలసీ ని ప్రభుత్వం ప్రకటిస్తుంది.