గుడ్ బై లైట్ హౌజ్ ఏడిపిస్తోన్న శాంతను పోస్ట్
అన్నీ తానై నడిపించిన వ్యక్తి, నేర్పించిన వ్యక్తి ఇక రేపటి నుంచి మనకు కనిపించరు అంటే.. ఊహించుకోడానికే ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కలిసి మనల్ని శూన్యంలోకి నెట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. రతన్ టాటా చనిపోయినప్పుడు ఆయన మేనేజర్ శాంతను నాయుడు కళ్లలో ఎగ్జాక్ట్‌గా ఇదే బాధ కనిపించింది.
అన్నీ తానై నడిపించిన వ్యక్తి, నేర్పించిన వ్యక్తి ఇక రేపటి నుంచి మనకు కనిపించరు అంటే.. ఊహించుకోడానికే ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కలిసి మనల్ని శూన్యంలోకి నెట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. రతన్ టాటా చనిపోయినప్పుడు ఆయన మేనేజర్ శాంతను నాయుడు కళ్లలో ఎగ్జాక్ట్‌గా ఇదే బాధ కనిపించింది. రతన్ టాటా అంతిమ యాత్ర జరిగినంతసేపూ శాంతను ఏడుస్తూనే ఉన్నాడు. వీడియోల్లో శాంతనను చూసి కన్నీళ్లు పెట్టుకోని వాళ్లు బహుశా ఉండరేమో. టాటా చనిపోయిన మూడో రోజుల తరువాత శాంతను సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మరోసారి ప్రతీ ఒక్కరి హృదయాన్ని పిండేస్తోంది. “మీరు దూరం కావడంతో మన స్నేహబంధంలో తీరని లోటు ఏర్పడింది. ఆ లోటు పూరించడానికి మిగిలిన జీవితమంతా వెచ్చిస్తాను. దు:ఖం ప్రేమకు చెల్లించాల్సిన ధర. గుడ్ బై.. నా ప్రియమైన లైట్‌హైస్ ” అని భావోద్వేగంతో పోస్ట్ చేశాడు శాంతను. రతన్ టాటా మరణించిన మూడు రోజుల తర్వాత తన ఇన్‌స్టాలో హృదయ విదారకమైన పోస్ట్ పెట్టాడు. ఆయన లేరని తాను నమ్మలేకపోతున్నట్టుగా చెప్పాడు. తన జీవితంలో తాను ఇంతకు ముందులా మళ్లీ నవ్వలేనేమో అంటూ శాంతను రాసిన ఎమోషనల్ లైన్ ప్రతీ ఒక్కరిటీ టచ్ చేస్తోంది.
వయసు 31 ఏళ్లే ఐనా టాటాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ శాంతను. సేవ పట్ల ఇద్దరికీ ఒకే మైండ్‌సెట్ ఉండటంతో వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. శాంతను జంతువుల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి టాటా శాంతనను తన మేనేజర్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం వృద్ధులకు సేవలు చేసేందుకు జంతువులను కాపాడేందుకు రెండు స్టార్టప్‌లు నడిపిస్తున్నాడు శాంతను. కేవలం శాంతను మాత్రమే కాదు. ఆయన కుటుంబం మొత్తం ఒక రకంగా టాటా సంస్థతో మమేకమై ఉంది. శాతంను తండ్రి అప్పట్లో టాటా మోటార్స్‌లో పనిచేసేవారు. తన కజిన్‌ది టీసీఎస్‌లో ఉద్యోగం. శాంతను తాత టాటా ఎలక్ట్రికల్‌లో పనిచేశారు. అతని తండ్రి టాటా పవర్‌లో పనిచేశారు. ఇలా వీరి కుటుంబం అంతా టాటా కంపెనీలోనే భాగమయ్యారు. శాంతను కూడా టాటా చివరి శ్వాస వరకూ టాటాతోనే ఉన్నాడు. తన లైట్ హౌజ్‌ను కోల్పోయిన శాంతను డిప్రెషన్‌ను త్వరగా బయటకి రావాలని ఆయనను అభిమానించేవాళ్లు పోస్టులు పెడుతున్నారు.