ముంబైకి పార్థీవ్ పటేల్ గుడ్ బై గుజరాత్ జట్టులో కొత్త బాధ్యతలు ?
ఐపీఎల్ మెగావేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ పైనా ఫోకస్ పెట్టాయి. గత సీజన్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని కొత్తగా ఎంపిక చేసుకుంటున్నాయి.

ఐపీఎల్ మెగావేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ పైనా ఫోకస్ పెట్టాయి. గత సీజన్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని కొత్తగా ఎంపిక చేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్ గా పార్థీవ్ పటేల్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. దీనిపై ఇప్పటికే అతనితో చర్చలు జరిపినట్టు సమాచారం. డీల్ ఓకే అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ అశిష్ నెహ్రా , డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీలతో కలిసి పార్థీవ్ పని చేయనున్నాడు. గత సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ కు టాలెంట్ స్కౌట్‌గా పార్థీవ్ సేవలందించాడు. ఇప్పుడు ముంబైకి గుడ్ బై చెప్పి గుజరాత్ ఫ్రాంచైజీలో భాగం కానున్నాడు.