కూర్చొబెట్టినందుకే గుడ్ బై, అశ్విన్ రిటైర్మెంట్ పై హాడిన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమిండియాను రెండు రకాలుగా బాధించింది. ఈ సిరీస్ ను కోల్పోయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు దూరమైంది. ఇక ఈ సిరీస్ మధ్యలోనే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 08:44 PMLast Updated on: Jan 08, 2025 | 8:44 PM

Goodbye To Being Made To Sit Ashwin Had No Intention Of Retiring

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమిండియాను రెండు రకాలుగా బాధించింది. ఈ సిరీస్ ను కోల్పోయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు దూరమైంది. ఇక ఈ సిరీస్ మధ్యలోనే టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ ఓటమికి పేలవ ప్రదర్శన కారణంగా చెప్పుకోవచ్చు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. బౌలింగ్ లో బుమ్రా ఒక్కడే ఆస్ట్రేలియాపై పోరాడాడు. సిరాజ్ రాణించినప్పటికీ కీలక సమయంలో చేతులెత్తేయడం భారత్ ను దెబ్బ తీసింది. ఇది పక్కనపెడితే సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అశ్విన్ నిర్ణయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అశ్విన్ తండ్రి రవిచంద్రన్ జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకుపడ్డాడు. తన కొడుకుని బెంచ్ పై కుర్చోపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక తాజాగా అశ్విన్ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అశ్విన్ రిటైర్మెంట్ సాధారణమైంది కాదని బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై బ్రాడ్ హాడిన్ విల్లో టాక్ పోడ్‌కాస్ట్‌లో పలు విషయాలను పంచుకున్నాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం తమాషాగా అనిపించిందని చెప్పాడు. మూడో టెస్టుకి అశ్విన్ సెలెక్ట్ కానందుకు బాధగా ఉందని చెప్పాడు. అశ్విన్ ని ఎప్పుడూ నంబర్ వన్ స్పిన్నర్‌గా చూస్తానని పేర్కొన్నాడు. టెస్టుల్లో అతని రికార్డు అద్భుతంగా ఉందని తెలిపాడు. అయితే మూడో టెస్టులో అశ్విన్ బెంచ్ మీద కూర్చోవడం సాధారణ విషయం కాదన్నాడు. ప్రతిభ ఉన్న సీనియర్ ఆటగాడిని బెంచ్ మీద ఉంచడంతోనే అశ్విన్ తీవ్రంగా నిరాశ చెందాడని బ్రాడ్ చెప్పాడు.అశ్విన్ రిటైర్మెంట్ గురించి అభిమానులకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నట్లు బ్రాడ్ చెప్పాడు. బ్రాడ్ హాడిన్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బ్రాడ్ వీడియోకి సోషల్ మీడియాలో అశ్విన్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తన రిటైర్మెంట్ వెనుక ఎదో కుట్ర ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ముగిసిన అధ్యాయాన్ని బ్రాడ్ మళ్ళీ తెరపైకి తీసుకురావడంతో టాపిక్ కాస్త హాట్ హాట్ గా నడుస్తుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. పెర్త్ టెస్ట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ స్థానంలో అడిలైడ్ టెస్ట్‌లో ఆడాడు. అయితే మూడో టెస్టులో అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించారు. ఇది అశ్విన్ ని తీవ్రంగా బాధించింది. దీంతో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.