Google Bot: గూగుల్ బార్డ్ సరికొత్త అప్డేట్.. మ్యాప్స్, డాక్స్, డ్రైవ్స్ తో అనుసంధానం
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ చాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఎన్నో నెలల సుదీర్ష ప్రయోగాల తరువాత ఈ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
నేటి యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర చాలా కీలకమైపోయింది. స్కూల్లో చెప్పే పాఠాల మొదలు న్యూస్ చదివే యాంకర్ వరకూ అన్నింటిలోనూ ఏఐ తన విస్తృతిని పెంచుకుంటోంది. ఒక మనిషికి మరో మనిషితో పనిలేకుండా చేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా గూగుల్ గురువుకు ప్రత్యమ్నాయం కాదు అంటారు కొందరు. అయితే ఈ గూగుల్ ఏఐ టెక్నాలజీతో రూపొందిన చాట్ జీపీటీకి ప్రత్యమ్నాయాంగా బార్డ్ ను తీసుకొచ్చింది. దీని కోసం గత నాలుగు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చారో అప్పటి నుంచే దీనికి ప్రత్యమ్నాయాన్ని తామే కనుగొనాలని తీవ్రంగా ప్రయత్నించింది. గతంలోకూడా వీలైనంత త్వరగా దీనిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సంస్థ సీఈఓ అప్పటి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కృత్రిమ మేధతో పనిచేసే బార్డ్ కు గూగుల్ కి చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్స్, తో పాటూ మరికొన్ని యాప్స్ ను అనుసంధానం చేసింది. దీంతో పాటూ మరిన్ని భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా క్వెరీల్లో వచ్చే సమస్యలను అధిగమించడమే కాకుండా వాటికి సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు వెసులుబాటు ఉంటుంది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ వేదికను అధిగమించేందుకు సరికొత్తగా రూపొందించి చాట్ జీపీటీకి పోటీగా దీనిని తీసుకొచ్చింది.
ఈ విషయాన్ని తాజాగా గూగుల్ వెల్లడించింది. గూగుల్ తో పనిచేసే జీమెయిల్ మొదలు గూగుల్ డ్రైవ్ వరకూ అన్నింటి నుంచి వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. అంతేకాకుండా గూగుల్ సంబంధిత యాప్స్ లోని డేటాను కూడా అందించేందుకు దోహదపడుతుంది. ఇలా అనుసంధానం చేయడం ద్వారా యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సరైన, ఖచ్చిత్వంతో కూడిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందించేందుకు సహాయపడుతుంది. ఈ ఎక్స్ టెన్షన్స్ ను డీపాల్ట్గానే ఆన్ చేసి ఉంటారు. మనకు అవసరం అయితే అలాగే కొనసాగవచ్చు. వద్దనుకుంటే దీనిని ఆఫ్ చేసుకోవచ్చు. దీనికోసం డిజేబుల్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
T.V.SRIKAR