Google AI Tool Gemini: బార్డ్ బదులు జెమినీ.. కొత్త AI టూల్ తెచ్చిన గూగుల్
గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది.
Google AI Tool Gemini: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) లో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది గూగుల్. గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కంటెంట్ ను క్రియేట్ చేయడం, ట్రాన్స్ లేషన్స్ లాంటివి చేస్తోంది.
KFC Outlet at Ayodhya: అయోధ్యలో KFC ఔట్‌లెట్.. కానీ..!
ఇప్పుడు దాన్ని మరింత మెరుగ్గా తయారు చేసి.. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్స్ కి అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఓపెన్ AI ద్వారా వచ్చిన Chat GPTని ఎదుర్కోడానికి Bardను తీసుకొచ్చింది గూగుల్. దాని పేరు జెమినీగా మార్చింది. ఆండ్రాయిడ్, IOS లో అందుబాటులో ఉండే జెమినీ AI యాప్ లో టెక్ట్స్, ఫోటో, ఆడియా, వీడియో, కోడింగ్ లాంటి అనేక రకాల సమాచారాన్ని 90శాతం కచ్చితత్వంతో అందిస్తుందని గూగుల్ తెలిపింది. వచ్చే వారంలో ఆసియా పసిఫిక్ ఏరియాలకు కూడా దీన్ని విస్తరిస్తారు. జపనీస్, కొరియన్ వెర్షన్స్ కూడా వస్తున్నాయి. ఐఫోన్లలోని జెమినీ యాప్ లో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం అయితే జెమినీ ఫ్రీ వెర్షన్ అందుబాటో ఉంది. దీనికి అడ్వాన్స్ సర్వీసెస్ అందించేందుకు నెలకు 20 డాలర్లను ఛార్జ్ చేయబోతోంది గూగుల్.
అంటే మన లెక్కలో దాదాపు 1700 వందల రూపాయలు. ఈ అడ్వాన్స్ వెర్షన్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ టిప్స్, ప్రాజెక్ట్ ఐడియాలు సహా యూజర్లకు ఎంతో ఉపయోగకరమైన కంటెంట్ ఉంటుంది. విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేలా ఈ టూల్ ని రూపొందించారు. జెమినీ AI అడ్వాన్సుడ్ ని ఎక్కువ మంది ఉపయోగించేందుకు ప్రోత్సాహంగా రెండు నెలల ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తోంది గూగుల్. ఈ జెమినీ యాప్ ఆండ్రాయిడ్ 13 ఆపైన వెర్షన్స్ కలిగిన మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.