Dark Site: సామాన్యులకు కూడా అందుబాటులో డార్క్ సైట్ రిపోర్టింగ్.. డార్క్ సైట్ అంటే ఏంటి..?

సామాన్యులకు గూగుల్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ డార్క్ వెబ్ ని గుర్తించడం. దీనిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2023 | 02:18 PMLast Updated on: Aug 30, 2023 | 2:18 PM

Google Made The Dark Site Available To Common People

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కని చేతిలో గూగుల్ ఉంటుంది. గూగుల్ ఉంటే సమస్త విశ్వం అతని అరచేతిలో ఉన్నట్లే. మనకు తెలియని ఏ విషయాన్నైనా క్షణాల్లో మనకు అందిస్తుంది. ఇలా అందించాలంటే మనం గూగుల్ సర్చ్ ఇంజన్ లో సంబంధిత విషయాన్ని నమోదు చేసి సర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే కొన్ని వెబ్ సైట్లు, లింకులు మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అలా కాకుండా కనిపించని సైట్లు కూడా ఉంటాయి వాటినే డార్క్ సైట్స్ అంటారు. గతంలో కేవలం కొందరికే ఉండే డార్క్ వెబ్ రిపోర్టింగ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. దీని సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికైతే ఎన్నిసార్లైనా వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే సామాన్యులకైతే ఒక్కసారి మాత్రమే తెలుసుకునేందుకు వీలుపడుతుంది. ఈ డార్క్ సైట్లపై  కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్. అందేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు డార్క్ సైట్ అంటే..

గతంలో డార్క్ సైట్ అనే పదం అతి తక్కువ మందిలో కొందరికే తెలిసేది. దీనిని అందరూ వినియోగించుకోలేరు. మనకు కనిపించని సైట్లు గూగుల్ లో కొన్ని లక్షల్లో ఉంటాయి. వీటిలో కంపెనీకి సంబంధించిన డేటాను, వ్యక్తిగతమైన సమాచారాన్ని, కొన్ని కీలక కేసుల వివరాలను, న్యాయపరమైన వివరాలను ఇందులో నమోదు చేసుకుంటారు. వీటిని ఎవరికీ తెలీయకుండా గోప్యంగా ఉంచుతారు. దీనికోసం కొంత డబ్బులను సైట్ డొమైన్ వారికి, గూగుల్ కి వెచ్చించాల్సి ఉంటుంది. దీనిని కొందరు మంచి కోసం వినియోగిస్తే మరి కొందరు అసాంఘీక, అనైతిక కార్యక్రమాలను ఉపయోగిస్తూ ఉంటారు. డ్రగ్స్ మాఫియా, బెట్టింగ్, కాల్ బాయ్స్ కి సంబంధించిన కార్యకలాపాలను నడిపి దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలాగే మన వ్యక్తిగతమైన సమాచారాన్ని కూడా దొంగలించి వారి సైట్లో పెట్టుకుంటారు. తద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతారు.

గూగుల్ తెచ్చిన డార్క్ వెబ్ ఫీచర్..

ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం వీటిలో మన వ్యక్తి గత డేటా ఏదైనా డార్క్ సైట్లో ఉంటే ఆ సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి వాటిని తొలగించుకునేందుకు వీలుంటుంది. మన వ్యక్తిగత వివరాలు పేరు, అడ్రస్, ఈ మెయిల్, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటివి నమోదు చేసి మన వివరాలు ఏమైనా ఈ సైట్లలో ఉన్నాయా అని వెరిఫై చేసుకోవచ్చు. దీనిని అమెరికా గత మార్చిలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మన దేశంలోకూడా ఈ వెసులు బాటు రావడం చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి. ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేయడం ద్వారా మన వివరాలు ఏదైనా డార్క్ సైట్ లో ఉంటే వెంటనే మనకు నోటిఫికేషన్ వచ్చేలా రూపొందించారు.

దీని ప్రాసెస్ ఇలా..

దీనిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. డబ్బులు చెల్లించి సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఉచితంగా కూడా వాడుకోవచ్చు. ఉచితంగా కావాలనుకుంటే వన్.గూగుల్.కామ్ లోకి వెళ్లాలి. కింద కనిపించే సెక్యూరిటీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మానిటర్ ద డార్క్ వెబ్ ఫర్ యువర్ పర్సనల్ ఇన్ఫో అని కనిపిస్తుంది. దీంతో పాటూ దాని కింది భాగంలో ట్రై ఎ స్కాన్ అని ఉంటుంది. దీనిని ఎంచుకున్న వెంటనే గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ప్రాసెస్ చేసిన తరువాత మొత్తం వివరాలన్నీ స్కాన్ అయి వ్యూ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ ఇస్తే మన ఈమెయిల్ లేదా ఇతర వివరాలు ఎన్ని సార్లు డార్క్ వెబ్ లో మనకు తెలియకుండానే ఉల్లంఘనకు గురైందో తెలుసుకోవచ్చు.

అదే గూగుల్ సబ్ స్క్రిప్షన్ కలిగిన వారైతే గూగుల్ వన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాకాకపోతే గూగుల్ వన్ వెబ్ పేజీ లో లాగిన్ అవ్వాలి. డార్క్ వెబ్ రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకొని సెటప్ బటన్ ని ఎంచుకోవాలి. ఆతరువాత మనం సర్చ్ చేయాలనుకుంటున్న వివరాలు నమోదు చేయాలి. ఇలా చేశాక మానిటరింగ్ చేసేందుకు కొత్త పేజీని క్రియేట్ చేసుకొని డన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ముందగా స్కానింగ్ అవుతుంది. డార్క్ వెబ్ లో ఏదైనా మనకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే చూపిస్తుంది.

డార్క్ వెబ్ వల్ల దుష్ప్రయోజనాలు..

  • డార్క్ వెబ్ లో మన పేరుతో డ్రగ్ వంటి కార్యకలాపాలను చేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరగాళ్లు చాకచక్యంగా తప్పించుకుని మనల్ని దోషులుగా చిత్రీకరించే అవకాశాలు ఉంటాయి.
  • అలాగే దొంగలించిన సెల్ ఫోన్లను మన పేరుతో సైట్ క్రియేట్ చేసి క్రయ విక్రయాలు జరుపుతారు. ఒకవేళ పోలీసులు ఐఎంఐ ద్వారా ట్రేస్ చేస్తే మన పేరుతో ఉండే సైట్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించి మనపై కేసు నమోదు చేస్తారు.
  • మనకు ఏ సైట్ ఓపెన్ చేసినా అనేక రకాల వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సైట్లు, గూగుల్ మ్యాప్ లొకేషన్లు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి డార్క్ సైట్ల ద్వారానే లావాదేవీలు జరుపుతారు.
  • ఇందులో ఉపయోగించే భాష పూర్తిగా ఎన్ క్రిప్షన్ రూపంలో ఉంటుంది. ఇది మనకు అస్సలు అర్థం కాదు. అందుకే దీనిగురించి చాలా మందికి తెలియదు.

T.V.SRIKAR