Google Maps : ఏట్లోకి తీసుకెళ్లిన గూగుల్‌ మ్యాప్స్..

ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు అడ్రస్‌ కనుక్కోవాలి అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. వాళ్లను వీళ్లను అడిగి కిందా మీదా పడి అడ్రస్‌ కనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చిన తరువాత ఈ పని సింపుల్‌ అయ్యింది. జస్ట్‌ లొకేషన్‌ ఆన్‌ చేస్తే మనం వెళ్లాల్సిన అడ్రస్‌కు దారి చూపిస్తుంది గూగుల్‌. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూరు లాంటి సిటీల్లో ఉండేవాళ్లు గూగుల్‌ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 06:57 PMLast Updated on: Dec 10, 2023 | 6:57 PM

Google Maps Taken To The Year

ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు అడ్రస్‌ కనుక్కోవాలి అంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. వాళ్లను వీళ్లను అడిగి కిందా మీదా పడి అడ్రస్‌ కనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చిన తరువాత ఈ పని సింపుల్‌ అయ్యింది. జస్ట్‌ లొకేషన్‌ ఆన్‌ చేస్తే మనం వెళ్లాల్సిన అడ్రస్‌కు దారి చూపిస్తుంది గూగుల్‌. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగళూరు లాంటి సిటీల్లో ఉండేవాళ్లు గూగుల్‌ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నగరంలో ఏ మూల ఉన్నా సింపుల్‌గా మ్యాప్స్‌తో డెస్టినేషన్‌ రీచ్‌ అవుతూ ఉంటారు. కానీ ప్రతీసారి ఈ గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకోవడం కరెక్ట్‌ కాదు. చాలా సార్లు చాలా సందర్భాల్లో గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్న ఎర్రర్స్‌ కారణంగా చాలా మంది రాంగ్‌ అడ్రస్‌లకు వెళ్లి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి. రీసెంట్‌గా ఇలాంటిదే ఓ ఇన్సిడెంట్‌ జరిగింది.

గూగుల్‌లో లోకేషన్‌ చూస్తూ వెళ్లినో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఏకంగా ఏట్లోకి ట్రాక్టర్‌ను తీసుకువెళ్లాడు. గూగుల్‌ను గుడ్డిగా నమ్మినట్టున్నాడు పాపం. ఏరు దాటగానే రోడ్డు వస్తుంది అనుకుని అలాగే ముందుకు వెళ్లాడు. కానీ సగం దూరం వెళ్లి నీళ్లలో చిక్కుకున్న తరువాత తెలిసింది మనోడికి.. గూగుల్‌ తనను ముంచేసిదని. చేసేదేం లేక తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. వెంటనే వాళ్లు జేసీబీ సహాయంతో ఇలా ట్రాక్టర్‌ను బయటికి తీసుకువచ్చారు. చూశారా గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మేస్తే అప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.