Sajjala: ఏపీ ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన సజ్జల
ఏపీ రాజకీయాలు రోజుకోరకంగా కీలక మలుపు తిరుగుతున్నాయి. మన్నటి వరకూ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు అని ఎమ్మెల్యే మీటింగ్లో చెప్తూ వచ్చారు. అయితే నిన్న జరిగిన తాజా పరిణామాలు గతంలో చేసిన మాటలను నీరుగార్చేలా ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి తోడూ ఉన్నపళంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు ఆజ్యంపోశాయి.
ఇక ప్రత్యర్థి పార్టీలు అయిన తెలుగుదేశం, జనసేనలు ఇప్పటికే యువగళం, వారాహి యాత్రల పేరుతో ప్రజల్లో కలివిడిగా తిరుగుతూ ఉన్నారు. పైగా పవన్ మన్నటి వరకూ గోదావరి రెచ్చిపోయిన ఆవేశపూరిత ప్రసంగాలు ఎన్నికలు జరిగేలా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. అయితే వీటన్నింటిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన తమ పార్టీ వాళ్లకు గానీ, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి గానీ లేదని స్పష్టం చేశారు.
ప్రజలు 2014 లో ఇచ్చిన ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకొనే ఎన్నికలకు వెళ్తామని స్పష‌్టతను ఇచ్చారు. పదవీ కాంక్షతో ప్రత్యర్థులు అయిన చంద్రబాబు, పవన్ లు ముందస్తు కావాలని కోరుకుంటున్నారు అని తెలిపారు. తమకు మాత్రం ఎలక్షన్ కి వెళ్లడానికి మరింత సమయం అవసరం అని వివరించారు.
T.V.SRIKAR