Abdul Nazir : ఏపీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్..
దేశ వ్యాప్తంతగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు.

Governor Abdul Nazir unfurled the flag at Indira Gandhi Stadium, Vijayawada.
దేశ వ్యాప్తంతగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు. ఈ గణతంత్ర వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy), సీఎం సతీమణి భారతి, మంత్రులు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ తర్వాత గవర్నర్ ఓపెన్ టాప్ జీపులో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్‌లను గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు.
ఇక రాష్ట్ర ప్రగతిని.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ కు అధికారులు వివరించారు. ఆపై పరేడ్‌లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు.
ఏపీ గవర్నర్ ప్రసంగం..
- ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
- ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి.
- గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది
- ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు
- ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది.
- సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
- ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
- ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి.
- ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి
- కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.
- సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు.
- 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు
- ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్తో వైద్యం అభినందనీయం
- జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు
- జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది.
- గర్భిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం
- సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి
- మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు
- రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం
- విలేజీ క్లీనిక్స్ గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి.
- జగనన్న అమ్మబడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు.
- జగనన విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది
- పెన్షన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత
- ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం
- పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
- ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత
- రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత
- ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన
- ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు
- స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి
- గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తు
- ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు
ఇవాళ్ల సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏపీ సీఎంతో పాటు రాజకీయా పార్టీ ప్రధాన నాయకులు హాజరుకానున్నారు.