Kodandaram: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్.. గవర్నర్ కోటాలో నియామకం..
కోదండరాంతోపాటు అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది.
Kodandaram: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. కోదండరాంతోపాటు అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు.
Republic Day: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. కర్తవ్యపథ్‌లోనే ఎందుకు..?
అనంతరం టీజేఎస్ అనే రాజకీయ పార్టీ స్థాపించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇది కాంగ్రెస్ గెలుపునకు ఎంతగానో ఉపయోగపడింది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని, కాంగ్రెస్‌కు సహకరిస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లోనే రేవంత్, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదించడంతో రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజానికి గతంలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాలి. అప్పట్లో బీఆర్ఎస్ సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటాకు కావాల్సిన అర్హతలైన వివిధ రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు, గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ.. గత ఏడాది సెప్టెంబరు 9న వారి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు.
గవర్నర్ నిర్ణయంపై దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయడం విశేషం. ఇక.. కోదండరాంను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. వచ్చే నెలలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. దీంతో ఆయనకు ఈ దఫా మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.