Governor’s speech : నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మూడోవ అసెంబ్లీ సమావేశాల్లో నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11.30కు సభ ప్రారంభంకానుంది. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 15, 2023 | 09:54 AMLast Updated on: Dec 15, 2023 | 9:54 AM

Governors Speech నేడు అసెంబ్లీలో గవర్న

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మూడోవ అసెంబ్లీ సమావేశాల్లో నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 11.30కు సభ ప్రారంభంకానుంది. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేసించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో.. ప్రభుత్వం ఇప్పటికే రెండు హామీలను అమలు మొదుల పెట్టింది. మిగిలిన గ్యారెంటీల అ‍మలు ఎపట్టి నుంచి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచిచూస్తున్నారు.

కాగా నేటి గవర్నర్ ప్రసంగంతో గ్యారెంటీల అమలుపై క్లారిటీ ఇచ్చే ఛాన్సుందని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.4వేల పెన్షన్‌,రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌పై ప్రభుత్వం గవర్నర్‌ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

నేటి గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ తొలి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్‌లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీంతో చర్చ వాడివేడిగా జరిగే అవకాశం లేకపోలేదు.