Minister Roja : రోజాకు గ్రీన్ సిగ్నల్.. నగరి టికెట్ కన్ఫాం చేసిన జగన్..
2024లో వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తున్నారు సీఎం జగన్. చాలా మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు ఇవ్వడంలేదనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడంలేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నికీ ఇప్పుడు ఫైనల్‌గా ఆన్సర్ దొరికింది. నగరి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సీఎం జగన్.
2024లో వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తున్నారు సీఎం జగన్. చాలా మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు ఇవ్వడంలేదనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడంలేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నికీ ఇప్పుడు ఫైనల్‌గా ఆన్సర్ దొరికింది. నగరి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సీఎం జగన్. తాడేపల్లిలో వరుసగా నేతలను కలుస్తున్న జగన్.. రోజాకు టికెట్ విషయంలో హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి రోజాకు టికెట్ ఇవ్వరు అని ఆఖరి నిమిషం వరకూ అంతా అనుకున్నారు. రీసెంట్‌గా రోజా కూడా ఈ విషయంలో నెగటివ్‌గానే కామెంట్ చేశారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ కోసం పని చేస్తామంటూ చెప్పారు.
స్వయంగా ఆమె అలా చెప్పడంతో ఇక టికెట్ పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో రోజానే ఫైనల్ చేశారట జగన్. ముందు నుంచీ వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా రోజాకు గుర్తింపు ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో తగ్గేదేలే అన్నట్టుగా రోజా వ్యవహారశైలి ఉండేది. జగన్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా కాపు కాసే నేతల్లో రోజా పేరు కూడా ప్రముఖంగా వినిపించేది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే సమాజంలో రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉన్నట్టు భావించారట జగన్. అందుకే పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ఈసారి కూడా రోజాకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. రోజా విషయం పక్కన పెడితే చాలా సిట్టింగుల్లో ఈ సారి మార్పులు జరగబోతున్నాయి. వాళ్లందరితో విడివిడిగా జగన్ భేటీ అవుతున్నారు. వీళ్లలో ఎందరికి టికెట్ వస్తుందో చూడాలి మరి.