రహస్య కెమెరాలు… అంతా పులిహోరే… తేల్చేసిన పోలీసులు…!

కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవల సంచలనం రేపిన... గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి రహస్య కెమెరాల ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ దీనిపై మాట్లాడుతూ... రహస్య కెమెరాలేమీ దొరకలేదు - ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 12:25 PMLast Updated on: Sep 06, 2024 | 12:25 PM

Gudlavalleru College Hidden Cameras Issue

కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవల సంచలనం రేపిన… గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి రహస్య కెమెరాల ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ దీనిపై మాట్లాడుతూ… రహస్య కెమెరాలేమీ దొరకలేదు – ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని తెలిపారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామన్నారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని పేర్కొన్నారు.

ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరూ చెప్పారని చెప్పిన ఐజీ… క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సేవలను వినియోగించామని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేసినట్టు వివరించారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ట్యాబ్ను టీం కు అందించామని ఎక్కడా ఏ క్లూ కూడా లేదని ఆయన స్పష్టం చేసారు.