గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం, అసిస్టెంట్ కోచ్ గా పార్థీవ్ పటేల్
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకోవడంలో బిజీగా ఉన్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్ గా నియమించింది.
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకోవడంలో బిజీగా ఉన్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. పార్థీవ్ రాకతో తమ సపోర్ట్ స్టాఫ్ మరింత బలపడిందంటూ ట్వీట్ చేసింది. 17 ఏళ్ళ పార్థీవ్ క్రికెట్ కెరీర్ ఇప్పుడు యువ ఆటగాళ్ళకు స్ఫూర్తినిస్తుందంటూ పేర్కొంది. పార్థీవ్ గతంలో ముంబై ఇండియన్స్ కు టాలెంట్ స్కౌట్ గా వ్యవహరించాడు. అలాగే ముంబై ఎమిరేట్స్ కు బ్యాటింగ్ కోచ్ గానూ బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్ లో పార్థీవ్ పటేల్ చెన్నై, ముంబై జట్లతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. తన క్రికెట్ కెరీర్ లో పార్థీవ్ భారత్ తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ ట్వంటీలు ఆడాడు.