Guntur Kaaram Review: ఇలా చేసావేంటి రమణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!
పోస్టర్, టీజర్‌లో మహేష్ బాబు ను ఊరమాస్‌గా చూపించిన తివిక్రమ్.. సినిమాను ఎలా తీశారోనన్న ఆసక్తి సినీ లవర్స్ లో నెలకొంది. సినిమాలో మహేష్ మాసీ క్యారెక్టర్ తప్ప స్క్రీన్ మీద ఏం కనిపించవు. మహేశ్ బాబు మాస్ యాక్షన్‌తో ఇరగదీశాడు.
Guntur Kaaram Review: అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం ఫైనల్ ప్రక్షకుల ముందుకు వచ్చింది. విడుదల ముందే పాటలతో ట్రైలర్ తో మాస్ ఘాటు ను చూపించిన మహేష్ హిట్ కొట్టాడా లేదా అన్నది తెలియాంటే రవ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
స్టోరీ ఏంటంటే..
వెంకట రమణ అయిన మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. పదేళ్ల వయసులోనే అమ్మ అయిన రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ గా ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఆయన కుమార్తె వసుంధర గా రమ్యకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటా మధు అయిన రవిశంకర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరతాడు. అయితే.. తన కుమార్తెను మంత్రి చేస్తానని పార్టీ అధినేత చెబుతారు. భర్తకు విడాకులు ఇచ్చి వసుంధర రెండో పెళ్లి చేసుకోవడం, మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేసి వచ్చిన విషయాలు బయట పెడతానని కాటా మధు బెదిరించే ప్రయత్నం చేస్తాడు. దాంతో రమణ అయిన మహేష్ బాబును పిలిచి తల్లితో తనకు ఎటువంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమని తాతయ్య కోరతాడు. రమణ గుంటూరు కారం లాంటోడు. ఎవ్వరికీ భయపడడు. తండ్రి రాయల్ సత్యంగా నటించిన జయరామ్ సాఫ్ట్ అయితే.. కొడుకు పక్కా మాస్. పాతికేళ్ల తర్వాత తల్లి నుంచి పిలుపు రావడంతో ఎంతో ఆశగా హైదరాబాద్ వచ్చిన రమణ.. బాండ్ పేపర్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. అసలు రాయల్ సత్యానికి వసుంధర ఎందుకు విడాకులు ఇచ్చింది.. పాతికేళ్లు కొడుకును కనీసం ఎందుకు చూడలేదు చివరకు ఏమైంది మధ్యలో అమ్ము అయిన శ్రీలీల తో రమణ కథేంటి మరదలు రాజిగా మీనాక్షి చౌదరి పాత్ర ఏమిటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Hanuman Movie Review : హనుమంతు కుమ్మేశాడు భయ్యా..
పర్పామెన్స్ ఎలా ఉంది..?
పోస్టర్, టీజర్‌లో మహేష్ బాబు ను ఊరమాస్‌గా చూపించిన తివిక్రమ్.. సినిమాను ఎలా తీశారోనన్న ఆసక్తి సినీ లవర్స్ లో నెలకొంది. సినిమాలో మహేష్ మాసీ క్యారెక్టర్ తప్ప స్క్రీన్ మీద ఏం కనిపించవు. మహేశ్ బాబు మాస్ యాక్షన్‌తో ఇరగదీశాడు. స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు. వన్ మ్యాన్ షోలా సినిమాను నడించాడు. శ్రీ లీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్.. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. డైలాగ్స్ పెద్దగా ఉండవు. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తిస్థాయిలో వాడుకోలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, జయరాం లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. గుంటూరు కారంలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయింది. ‘కథ, కథనాల్లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే.. ఈ సినిమా చూస్తుంటే అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలు చూస్తున్న ఫిలింగ్ కలుగుతుంది. కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కదల్లేదు. విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథను తీసుకునప్పటికి.. మ్యాజిక్ చేయలేకపోయాడు. యాక్షన్ సీన్లపై ఫోకస్ పెట్టాడు. గుంటూరు యాస ఎటకారం ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. తమన్ సంగీతం మెప్పించింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. ఓవరాల్ గా మహేష్ బాబును మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం అదిరిపయింది. ఎందుకంటే.. ‘గుంటూరు కారం’లో మమకారం లేదు. హీరో నటనలో ఘాటు తప్ప. సినిమాలో హైప్ ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. 10 కామెడీ సీన్స్ రాసుకొని దానికి స్టోరీ అల్లుకొని డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం చూపించాడు. నిజం చెప్పాలంటే మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిజప్పాయింట్ చేసే చిత్రమిది.