GVL Narasimha Rao: విశాఖలో జీవీఎల్ పోస్టర్స్.. ఫ్రెండ్లీగా పోటీ చేస్తా.. అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ !

సడన్‌గా విశాఖపట్నం లోక్‌సభ నియోజవకర్గంలోని 7 పార్లమెంట్ సీట్లల్లో రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనజాగరణ సమితి పేరుతో విశాఖ ఎంపీ టిక్కెట్ GVLకే ఇవ్వాలంటూ ఈ ఫ్లెక్సీలు కట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 04:24 PMLast Updated on: Apr 06, 2024 | 4:24 PM

Gvl Narasimha Rao Wants Contest From Visakhapatnam As Friendly Contest Posters Placed

GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల్లో ఇంకా కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. టిక్కెట్లు దక్కక పక్క పార్టీల్లోకి చేరేవాళ్ళు కొందరైతే.. రెబల్‌గా పోటీ చేస్తామని తమ పార్టీల అధిష్టానాలకు మరికొందరు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైజాగ్ ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ GVL నరసింహారావు ఇప్పుడో కొత్త రిక్వెస్ట్‌తో ముందుకొచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థిపై.. ఫ్రెండ్లీ కంటెస్ట్‌కి అనుమతి ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ GVL నర్సింహారావు విశాఖపట్నం పార్లమెంట్ సీటుపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు.

Raghu Rama Krishna Raju: రఘురామకు టీడీపీ టిక్కెట్.. ఉండి నుంచి బరిలోకి

గత రెండేళ్ళుగా ఇక్కడే మకాం పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని ప్రోగ్రామ్స్ CSR కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చేయించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీ కలసి కూటమిగా ఏర్పడటంతో విశాఖ ఎంపీ టిక్కెట్టు టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. అక్కడ బాలక్రిష్ణ అల్లుడు శ్రీ భరత్ పోటీ చేస్తున్నారు. కానీ వైజాగ్ టిక్కెట్ కోసం బీజేపీ అధిష్టానం దగ్గర GVL ఎన్ని పైరవీలు చేసిన వర్కవుట్ కాలేదు. దాంతో కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్నారు జీవీఎల్. కానీ సడన్‌గా విశాఖపట్నం లోక్‌సభ నియోజవకర్గంలోని 7 పార్లమెంట్ సీట్లల్లో రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనజాగరణ సమితి పేరుతో విశాఖ ఎంపీ టిక్కెట్ GVLకే ఇవ్వాలంటూ ఈ ఫ్లెక్సీలు కట్టారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, మద్దిలపాలెం జంక్షన్, ఏయూ ఇంజినీరింగ్ గేటు, సిరిపురం జంక్షన్, జగదాంబ జంక్షన్, ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా ఏరియాల్లో GVL నర్సింహారావుకి అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అందరితోనూ సన్నిహిత సంబంధాలున్న జీవీఎల్ గెలిస్తే.. విశాఖ అభివృద్ధికి నిధులు వస్తాయంటున్నారు జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు.

విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉండటం వల్ల అందులో పనిచేస్తున్ననార్త్ ఇండియన్ ఎంప్లాయీస్, స్థానిక వ్యాపారులు కూడా బీజేపీకి అనుకూలమంటున్నారు. ఏపీలో బీజేపీకి బలం ఉన్న విశాఖ సీటును టీడీపీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీవీఎల్ వర్గం మరో కొత్త ప్రతిపాదను తీసుకొస్తోంది. పోటీలో టీడీపీ అభ్యర్థి ఉన్నా ఫర్వాలేదు. ఫ్రెండ్లీ కంటెస్ట్‌కి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అంటే ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా బీజేపీ తరపున పోటీకి GVLకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. కానీ టీడీపీ-జనసేన సపోర్ట్ లేకుండా వైజాగ్ ఎంపీ సీటు బీజేపీకి గెలవడం కష్టమనే వాదన ఉంది. 2014లో విశాఖ ఎంపీగా హరిబాబు గెలిచారు. అప్పుడు కూడా ఈ రెండు పార్టీల మద్దతు ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి GVL ఒంటరిగా పోటీ చేస్తే.. మిగిలిన రెండు పార్టీలు సపోర్ట్ చేస్తాయా..? అయినా సరే.. తనకు టిక్కెట్ ఇవ్వాలని GVL బీజేపీ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కమలం పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.