బ్రేకింగ్: విజయసాయి రెడ్డికి గట్టి షాక్
విశాఖ జిల్లా భీమినిపట్నం సాగరతీరంలో తీర ప్రాంత పరిరక్షణ నియమాలను (సి.ఆర్.జడ్) ఉల్లఘించిన వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు.
విశాఖ జిల్లా భీమినిపట్నం సాగరతీరంలో తీర ప్రాంత పరిరక్షణ నియమాలను (సి.ఆర్.జడ్) ఉల్లఘించిన వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. సముద్ర గర్భంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ కట్టడాలు నేలమట్టం వరకు జివిఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం 23-02-2024న WP(PIL) No. 53/2024 జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసారు.
మూర్తి యాదవ్ పిల్ పై హైకోర్ట్ ఆదేశాలు లతో రెండు వారాల క్రితమే కూల్చివేత మొదలు పెట్టారు అధికారులు. ఇప్పుడు పూర్తి స్థాయి నేలమట్టం చేయాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతల ఖర్చు నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. భీమిలి సర్వ్ నెంబర్ సర్వే నెం:1516,1517 1519మరియు 1523 పరిధిలో సుమారు నాలుగు ఎకరాలు స్థలంలో అక్రమ కట్టడాలు చేపట్టారు.
పర్యావరణ శాఖలు నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి నిర్మిస్తున్న నక్షత్ర హోటల్ పై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. హోటల్ నిమిత్త గోడ మరియు శాశ్వత కాంక్రిట్ నిర్మాణాలు చేపట్టారు.