Praneeth Rao hacking : హ్యాకింగ్… దమ్కీలు… పైసల్ దందా … ప్రణీత్ రావు అక్రమాల చిట్టా !

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) DSP గా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు (Praneet Rao) హ్యాకింగే కాదు... అక్రమ దందాల వ్యవహారం కూడా బయటకు వస్తోంది. ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 01:39 PMLast Updated on: Mar 19, 2024 | 1:39 PM

Hacking Dhamkilu Paisala Danda Praneet Raos Log Of Irregularities

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) DSP గా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు (Praneet Rao) హ్యాకింగే కాదు… అక్రమ దందాల వ్యవహారం కూడా బయటకు వస్తోంది. ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన డైరీలో వందల కొద్దీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ (Intelligence Chief) చెప్పినవి కాకుండా ఇతర నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్టు బయటపడింది. వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నేతలు ఇచ్చిన ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసేవాడు ప్రణీత్ రావు. ఆ ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయడమే కాకుండా వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడం… భారీ మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసినట్టు తేలింది. ఈ ఎక్స్ టార్షన్ దందాలో ప్రణీత్ రావుకు ఓ పొలిటికల్ లీడర్ తో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్టు తెలుస్తోంది. ప్రణీత్ ను క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు… 42 హార్డ్ డిస్కులను కట్టర్లతో కట్ చేసి.. వాటిని వికారాబాద్ అడవిలో పడేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టు తెలిసింది. ప్రణీత్ లో కలసి SIB లో పనిచేసి… ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో CI గా పనిచేస్తున్న మరో అధికారిని కూడా పోలీసులు పిలిపించారు.