29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, పంత్ అరుదైన రికార్డ్
సిడ్నీ టెస్ట్ రెండోరోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. టీ ట్వంటీ తరహాలో ఆడిన పంత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
సిడ్నీ టెస్ట్ రెండోరోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. టీ ట్వంటీ తరహాలో ఆడిన పంత్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్‌నే తొలి స్ధానంలో ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.