Hamas Vs Israel: ఇజ్రాయెల్ లో హమాస్ సృష్టించిన బీభత్సం మామూలుగా లేదు.. దీనికి కారణం ఏంటి..?
ప్రపంచంలోని పేరొందిన దేశం ఇజ్రాయెల్. దీనికి ఉన్న ఆయుధ సంపత్తి పెద్దగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా కొన్ని చోట్ల లేవు. అయితే ఆ దేశంలోని ఒక చిన్న వర్గం వాళ్లు చేసే యుద్దానికి బలైపోతోంది. ప్రస్తుతం చిన్న బృందంగా ఉన్న హమాస్ తో తీవ్రమైన దాడులను ఎదుర్కొంటోంది. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇజ్రాయిల్ ప్రపంచంలోని అన్ని దేశాలతో పోటీగా సాయుధ ఆయుధాలను ఏర్పాటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. అయితే తాజాగా హమాస్ అనే ఒక పక్షం దీనిపై తిరుగుబాటుకు దిగింది. హమాస్ అంటే హర్కత్ అల్ ముఖావమా అల్ – ఇస్లామియా అనే పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఒకటిగా పిలువబడుతోంది. ఇది గతంలో జెరుసలేంలోని ఇజ్రాయిల్ చేపట్టిన ఆక్రమాలను వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి తిరుగుబాటు యుద్దాన్ని చేసింది. దీనిని ఇంతిఫదా ఉద్యమం అని కూడా అంటారు. ఈ యుద్దం 1987లో పశ్చిమ బ్యాంగ్, గాజా, తూర్పు జెరుసలేం ప్రాంతాల్లో జరిగింది. ఇలాంటి యుద్ద పరిస్థితుల నడుమ హమాస్ ఏర్పాటైంది. దీనిని షేక్ అహ్మద్ యాసిన్ అనే అతను నాయకుడుగా ఉండేవారు. దీనిని ఒక బృందంగా ఏర్పాటు చేసుకుని ముస్లీం బ్రదర్ హుడ్ అనే సంస్థకు రాజకీయంగా మద్దతు తెలిపే స్థాయికి ఎదిగింది. అందులో భాగంగానే 1988లో హమాస్ తన చార్టర్ ను ప్రచురించింది. ఇందులో కీలకమైన అంశాలను పొందుపరిచింది. ఇజ్రాయిల్ ను నాశనం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కారణం గతంలోని పాలస్తీనాను తిరిగి పునరుద్దరించి ఇస్తామిక్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడింది. అప్పటి నుంచే ఇలాంటి ఎదురుదెబ్బలు ఇజ్రాయిల్ కు తప్పడం లేదు. తాజాగా కాస్త విజృంభించి పోరాటం చేస్తోంది.
కిడ్నాప్ లు, బెదిరింపులు..
ఇలా యుద్దం కొనసాగుతున్న తరుణంలో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ తోపాటూ అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్జాక్ రాబిన్ కుదిర్చారు. ఈ ఒప్పందం 1993లో జరిగింది. దీనిని ఓస్లో ఒప్పందంగా పిలుస్తారు. వెస్ట్ బ్యాంక్, గజా, పాలస్తీనా అధికారంలో కొన్ని పరిమితులు విధించి పాలించడమే ఈ ఒప్పందం సారాంశం. దీనిని హమాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒప్పందానికి విరుద్దంగా యుద్దానికి దిగింది. 2000 సంవత్సరంలో రెండవ ఇంతిఫదాకు హమాస్ నాయకత్వవ వహించింది. అందులో భాగంగానే అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడింది. ఈ హింసాత్మక చర్యల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయిల్ సైనికుడైన గిలాడ్ షాలిత్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పటికే కొన్ని వందల మంది పాలస్తీనా సైనికులు ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వారందరినీ బయటకు సురక్షితంగా విడిపిస్తే కానీ మీ సైనికుడిని విడుదల చేయమని హెచ్చరించింది. దీంతో వందల మంది ఖైదీలను విడుదల చేసింది.
నిధుల సమీకరణ ఇలా..
2006 నాటి నుంచి హమాస్ తన బలాన్ని, బలగాన్ని భారీ స్థాయిలో విస్తరించుకుని పాలన సాగిస్తోంది. అందులో భాగంగానే 2023 ఏప్రిల్ లో ఆత్మహుతి దాడులకు కూడా పాల్పండింది. దాదాపు కొన్ని దశాబ్ధాల తరువాత ఇదే హింసాత్మక ఘటనగా కూడా చెబుతారు. ఆ తరువాత అనేక దాడులకు పాల్పడుతూ వచ్చింది. దీనిని అమెరికా, బ్రిటన్ లు తీవ్రంగా ఖండిస్తూ విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ముద్రవేశాయి. ఈ స్థాయిలో దాడుల చేసేందుకు వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకునేందుకు చాలా మంది అన్వేషించారు. అప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాలస్తీనా వాసులు గల్ఫ్ దేశాల్లోకి వెళ్లి ప్రవాస వాసులుగా స్థిరపడ్డారు. అక్కడే కొన్ని ప్రైవేట్ సంస్థలను ఏర్పాటు చేసి డొనేషన్ రూపంలో నిధులు అందిస్తున్నారు. ఇలా హమాస్ కు అధిక స్థాయిలో నిధులు అందుతున్నాయి. పశ్చిమ దేశఆల్లోని ఇస్తామిక్ డొనేషన్ సంస్థల నుంచి కూడా విరాళాలు అధిక మొత్తంలో వస్తూ ఉంటాయి. తాజాగా వెల్లడైన అంశాల్లో కీలకమైన సమాచారం ఏంటంటే.. ఇరాన్ ప్రతి ఏడాది 10 కోట్ల డాలర్లకు పైగా హమాస్ కు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయుధాల సమకూర్పు ఎలా..
హమాస్ ఇంతటి స్థాయిలో ఇజ్రాయిల్ ను వణికించడానికి ప్రదాన కారణం భారీగా సమకూర్చుకున్న ఆయుధ బాంఢాగారమే అని చెప్పాలి. యుద్దవిమానాలను ఒక ప్రాంతంలో స్థిరంగా ఉంచి భూభాగంలో ఏ ప్రదేశానికైనా లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులకు పాల్పడే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంది. దీంతో ఇజ్రాయెల్ కు తీవ్ర తలనొప్పిగా మారింది. అందుకే తన ఆయుధస్థాయిని అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. హమస్ పై దాడికి దిగేందుకు మోర్టార్లను, మండే స్వభావం కలిగిన బెలూన్లను సమకూర్చుకుంది. ఇవి గాల్లో ఎగురుకుంటూ వెళ్లి పెద్ద పెద్ద మంటలు చెలరేగి భారీగా నష్టాన్ని కలిగిస్తాయి. ఇంత బలంగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ను మట్టుపెట్టేందుకు హమాస్ ఇరాన్, సిరియా నుంచి రహస్యంగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇందులో దీర్ఘ శ్రేణి రాకెట్లు, పేలుడు సంభవించే పదార్థాలు, భారీ యంత్రాలు, ఈజిప్టు సరిహద్దు నుంచి గజాలోకి ప్రవేశించి ఇరాన్ నుంచి సైనాయ్ చేరుకుంటాయి. సైనాయ్ అనేది ద్వీప కల్పం కావడంతో సొరంగ మార్గం ద్వారా గజా కు చేరుస్తారు. హమాస్ ఆయుధాలను తయారుచేసుకునే ప్రాంతాన్ని గాజా పౌరులు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ వారిపై దాడి చేయడానికి వెనుకడుగు వేస్తోంది. పాలస్తీనా వాళ్ల కోసం అమయకు ప్రజలు బలవుతారని భావిస్తోంది.
హమాస్ వద్ద ఉన్న యుద్ద ఆయుధాలు ఏంటి..
తక్కువ దూరం ప్రభావం చూపే రాకెట్లు..
ఖాసం అనే రాకెట్ 10 కిలోమీటర్ల పరిధి వరకూ ప్రభావం చూపుతుంది.
ఖుద్స్ 101 అనే యుద్ద నౌక 16 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది.
గ్రాడ్ వ్యవస్థ 55 కిలోమీటర్ల వరకూ చొచ్చుకుపోగలదు.
సెజిల్ 55 అయితే 55 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించి విధ్వంసం సృష్టించగలదు.
ఎక్కువ దూరం ప్రయాణించే రాకెట్లు..
ఎం – 75 అనే రాకెట్ 75 కిలోమీటర్లు ప్రయాణించగలదు
ఫజర్ అయితే 100 కిలోమీటర్ల పరిధిలోని సైనిక స్థావరాలను మట్టుపెట్టగలదు
ఆర్ – 160 అయితే 120 కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకుపోగలదు
ఎం 302 రాకెట్ దాదాపు 200 కిలోమీటర్ల వరకూ విస్తరించి యుద్దదాడి చేస్తుంది.
అయాష్ అయితే 250 కిలోమీటర్లలో ఉండే శత్రవులను సైతం నాశనం చేయగలదు.
T.V.SRIKAR