Hanuman team : అయోధ్య రామునికి హనుమాన్ టీం విరాళం
హనుమాన్ మూవీ ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆర్టిస్టుల దగ్గరనుంచి టెక్నిషియన్స్ దాకా అందరు సూపర్ గా చేశారనే పేరుని హనుమాన్ వాళ్ళకి ఇచ్చాడు. మూవీ రిలీజ్ కి ముందు హనుమాన్ టీం ఒక ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.

Hanuman team donates to Ram in Ayodhya
హనుమాన్ (Hanuman) మూవీ ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆర్టిస్టుల దగ్గరనుంచి టెక్నిషియన్స్ దాకా అందరు సూపర్ గా చేశారనే పేరుని హనుమాన్ వాళ్ళకి ఇచ్చాడు. మూవీ రిలీజ్ కి ముందు హనుమాన్ టీం ఒక ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.
హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Hanuman Pre Release) లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, (Prashanth Varma) ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి లు హనుమాన్ సినిమా (Hanuman team) ఆడినన్ని రోజులు కూడా టికెట్ మీద వచ్చే తమకి వచ్చే అమౌంట్ లో ప్రతి ఐదు రూపాయలని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటకి తగ్గట్టే హనుమాన్ ప్రీమియర్ షో ల ద్వారా వచ్చిన అమౌంట్ 14 .25 లక్షలని అయోధ్యకి (Ayodhya Rama) విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చిత్ర బృందం ప్రకటించింది.ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే హనుమాన్ ద్వారా టీం అయోధ్య మందిరానికి (Ayodhya Ram ) ఎంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయం మూవీ ఆడినన్ని రోజులు కూడా అందరు తెలుసుకోవడానికి యూనిట్ ఒక వెబ్ సైట్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. ప్రస్తుతం ఇండియా వైడ్ గా హనుమాన్ ఆడుతున్న థియేటర్స్ అన్ని కూడా రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమాన్ కి అనే నామ జపంతో ఊగిపొతున్నాయి.