RAYUDU : అంబటి ఫ్యామిలీకి వేధింపులు.. కోహ్లీపై కామెంట్స్ ఎఫెక్ట్
ఐపీఎల్ (IPL) లో మాజీ క్రికెటర్ (Former Cricketer) అంబటి రాయుడు (Ambati Rayudu) ... విరాట్ కోహ్లీ (Virat Kohli) పై చేసిన కామెంట్స్ వివాదం అంతకంతకూ ముదురుతోంది.

Harassment of Ambati family.. Effect of comments on Kohli
ఐపీఎల్ (IPL) లో మాజీ క్రికెటర్ (Former Cricketer) అంబటి రాయుడు (Ambati Rayudu) … విరాట్ కోహ్లీ (Virat Kohli) పై చేసిన కామెంట్స్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. ప్రస్తుతం అంబటిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు కోహ్లీ ఫ్యాన్స్. అంబటి రాయుడుకి బెదిరింపు మెస్సేజ్ లు పంపుతున్నారు. కుటుంబ సభ్యుల్ని చంపేస్తామనీ… భార్య, కూతుళ్ళను అత్యాచారం చేస్తామని కామెంట్స్ పెడుతూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు జట్టుతో పాటు… విరాట్ కోహ్లీపై.. గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విమర్శలు చేస్తున్నాడు. IPL 2024 లో ఓ కీలక మ్యాచ్ లో RCB చేతిలో CSK ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో విజయంతో RCB ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్ళింది. ఈ మ్యాచ్ తర్వాత నుంచి రాయుడు…RCB పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడు. ప్లే ఆఫ్ చేరితేనే… టైటిల్ గెలిచినట్టు సంబరాలా అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి… ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీపైనా విమర్శలు చేశాడు. క్యాప్ గెలిచినంత మాత్రాన….. IPL ట్రోఫీ గెలవలేరని అన్నాడు రాయుడు.
ఈ కామెంట్స్ ని బెంగళూరు, కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో రాయుడితో పాటు అతని భార్య, ఇద్దరు చిన్నారులను కూడా టార్గెట్ చేశారు. రాయుడిని బండబూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నట్టు… అంబటి ఫ్రెండ్ సామ్ పాల్ ఇన్ స్టా గ్రామ్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. రాయుడి భార్య, ఏడాది, నాలుగేళ్ల వయసున్న కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. అంబటి భార్యపై అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపాడు. రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందంటున్నాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సామ్ పాల్ విజ్ఞప్తి చేశాడు. క్రికెట్ లో విమర్శలు సహజమేననీ… కానీ అంతమాత్రాన రాయుడి ఫ్యామిలీని టార్గెట్ చేసి బెదిరించడం, ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు కొందరు నెటిజన్స్.