HARDIK DIVORCE : భార్యకి విడాకులిస్తున్న హార్దిక్.. భరణం కింద ఆస్తుల్లో 70శాతం వాటా

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఫెయిల్ అయిన పాండ్యాకి జీవితంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్య నటాషాతో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారనీ... విడాకులు మంజూరైతే పాండ్యా తన ఆస్తుల్లో 70శాతం భరణం కింద భార్య, కొడుక్కి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2024 | 02:04 PMLast Updated on: May 25, 2024 | 2:04 PM

Hardik Divorces His Wife 70 Percent Share Of Assets Under Maintenance

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఫెయిల్ అయిన పాండ్యాకి జీవితంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్య నటాషాతో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారనీ… విడాకులు మంజూరైతే పాండ్యా తన ఆస్తుల్లో 70శాతం భరణం కింద భార్య, కొడుక్కి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. నటాషా విడాకుల నోటీసులో 70శాతం వాటా అడిగినట్టు తెలుస్తోంది.

ఈమధ్య నటాషా సోషల్ మీడియా అకౌంట్ లో తన పేరు పక్కన పాండ్యాను డిలీట్ చేయడంతో… వీళ్ళిద్దరూ విడిపోతున్నారన్న అనుమానాలు మరింత పెరిగాయి. ఈ IPL 2024 సీజన్ లో నటాషా ఒక్కసారి కూడా పాండ్యా ఆడే మ్యాచులు చూడటానికి రాలేదు. మిగతా క్రికెటర్లు తమ భార్యలు, గాళ్ ఫ్రెండ్స్ తో హడావిడి చేశారు. అలాగే హార్దిక్, నటాషా గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడా హడావిడి కనిపించట్లేదు. అంతేకాదు… మార్చి 4న హార్దిక్ పాండ్యా బర్త్ డే జరుపుకున్నా… కనీసం విషెస్ కూడా నటాషా పోస్ట్ చేయలేదంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.

2018లో ముంబై నైట్ క్లబ్ లో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కో విక్ కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసి… 2020 మేలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తొలి బిడ్డ అగస్త్య పాండ్యా పుట్టిన తర్వాత 2023 ఫిబ్రవరిలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్ళి చేసుకున్నారు.

పాపం హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది వరసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జనవరిలో వరుసకు అన్న అయిన వైభవ్ పాండ్యా బిజినెస్ లో 4 కోట్లకు ముంచేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు నాటాషాతో బ్రేకప్ అయితే… హార్దిక్ 70శాతం ఆస్తులు ఆమెకు భరణం కింద ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ముంబై కెప్టెన్సీలో ఘోర వైఫల్యంపైనా హార్దిక్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళీ టీమిండియాలో వెలుగు వెలగాలని అభిమానులు కోరుతున్నారు.