హార్థిక్ పై ఒక మ్యాచ్ నిషేధం, సీజన్ కు ముందే ముంబైకి షాక్

ఐపీఎల్ మెగావేలం ముంగిట ముంబై ఇండియన్స్ కు షాకింగ్ న్యూస్... వచ్చే సీజన్ ఆరంభ మ్యాచ్ కు హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండడం లేదు. అతనిపై ఓ మ్యాచ్ నిషేధం అమలు చేస్తున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 08:10 PMLast Updated on: Nov 21, 2024 | 8:10 PM

Hardik Gets One Match Ban Shock For Mumbai Before The Season

ఐపీఎల్ మెగావేలం ముంగిట ముంబై ఇండియన్స్ కు షాకింగ్ న్యూస్… వచ్చే సీజన్ ఆరంభ మ్యాచ్ కు హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండడం లేదు. అతనిపై ఓ మ్యాచ్ నిషేధం అమలు చేస్తున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఐగత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్‌ చేసినందుకుగానూ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. గత సీజన్‌లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఆ నిషేధాన్ని 2025 సీజన్ లో అమలు చేయనున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచ్ లో హార్థిక్ ఆడే అవకాశం లేదు. కాగా ఈ నిషేధంతో పాటు హార్దిక్‌కు 30 లక్షల జరిమానా కూడా విధించారు. కాగా హార్థిక్ తర్వాతి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు అప్పటి మ్యాచ్‌లో ఆడిన ప్రతి ఆటగాడికి 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.

కాగా, గత సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం వచ్చే సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ 2024 సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న పాండ్యా అంచనాలకు తగ్గట్టు జట్టును నడిపించలేకపోయాడు. దీంతో వరుస ఓటములతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే వచ్చే సీజన్ కోసం ముంబై ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ముంబై రిటైన్ జాబితాలో హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, తిలక్‌ వర్మ ఉన్నారు. ఇదిలా ఉంటే
ముంబై ఇండియన్స్‌కు ఒక ఆర్టీఎం ఛాయిస్ మిగిలే ఉంది. దీంతో తాము వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ళలో ఒకరిని తిరిగి దక్కించుకోవచ్చు.

ఈ సారి మెగా వేలంలో మొత్తం 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవ్వగా.. అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది ఇండియన్స్, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా అందులో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు. వీళ్లలో 70 మంది విదేశీ ప్లేయర్సే వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో 318 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 12 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ ను కూడా షార్ట్ లిస్ట్ చేశారు. ఈ వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ తో 81 మంది ప్లేయర్స్ ఉన్నారు. అలాగే కోటిన్నర బేస్ ప్రైస్ తో 27 మంది, 1.25 కోట్లలో 18 మంది, 1 కోటి బేస్ ప్రైస్ లో 23 మంది ప్లేయర్స్ ఉన్నారు.