Hardik Pandya: వరల్డ్ కప్ జట్టులో హార్దిక్‌ కష్టమే.. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ కోటాలో శివమ్‌ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 05:48 PMLast Updated on: Apr 15, 2024 | 5:48 PM

Hardik Pandya Will Not Be Select In T20 World Cup Says Manoj Tiwary

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌ సారధి హార్దిక్‌ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్‌ మనోజ్‌ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్‌ టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ కోటాలో శివమ్‌ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.

Shivam Dube: వరల్డ్ కప్ జట్టులో చెన్నై హిట్టర్..? చోటు ఖాయం అంటున్న ఎక్స్‌పర్ట్స్

ఐపీఎల్‌లో హార్దిక్‌ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్‌ వేశాడని.. ఈ సీజన్‌లో అతని ఎకానమీ రేట్‌ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్‌ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడని తేల్చేశాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్‌ మెరుపులతో శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కాలేడని అంచనా వేశాడు.దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేయాలని సూచించాడు.

ఒకవేళ దూబే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్‌కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్‌కే కెప్టెన్‌ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు. కాగా, ఈ ఏడాది జూన్‌ 1 నుంచి మొదలయ్యే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది.