వన్డే ఫార్మాట్లోకి హార్దిక్ రీఎంట్రీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక ఊచకోతే

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్ కు దూరమైన హార్దిక్ త్వరలో తిరిగి రానున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 05:05 PMLast Updated on: Dec 27, 2024 | 5:05 PM

Hardiks Re Entry Into The Odi Format No More Worries In The Champions Trophy

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్ కు దూరమైన హార్దిక్ త్వరలో తిరిగి రానున్నాడు. అవును ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 50 ఓవర్ల మ్యాచ్‌లలో హార్దిక్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజులుగా వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉన్న హార్ధిక్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ దేశవాళీ టోర్నీ హార్దిక్ కి మంచి చాన్స్ అనే చెప్పాలి.

2023 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 19 అక్టోబర్ 2023న మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి హార్దిక్ వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే హార్దిక్ వన్డే పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు హార్దిక్ వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి రావడం టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 50 ఓవర్ల ఫార్మెట్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. బరోడా తరఫున బెంగాల్‌తో బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ తిరిగి వన్డేల్లోకి రావడంతో అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం. ఈ పరిస్థితిలో హార్దిక్ ఈ టోర్నమెంట్ లో రాణించాల్సి ఉంది. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి కూడా విజయ్ హజారే ట్రోఫీ హెల్ప్ అవుతుంది. హార్థిక్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 86 వన్డేలు ఆడి 1769 రన్స్ , 84 వికెట్లు పడగొట్టాడు.