Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ పై హరీష్ క్లారిటీ… వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతా…!
ఏదేమైనా... పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.

Harish Clarity on Ustad Bhagat Singh... Should talk to them directly...!
ఏదేమైనా… పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే సినిమా విడుదల అయితే చాలు అసలు కనీసం ఫస్ట్ లుక్ వచ్చినా చాలు అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సినిమా షూటింగ్ మొదలై ఏదైనా చిన్న వీడియో గాని ఫోటో గాని బయటకు వస్తే సినిమా విడుదల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. హిట్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ అంటే చాలు ఫాన్స్ ఇక ఊగిపోతూ ఉంటారు.
గబ్బర్ సింగ్ (Gabbar Singh) లాంటి హిట్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటే…? ఆ క్రేజ్ ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇప్పుడు హరీష్ శంకర్ (Harish Shankar) తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళిన పవన్… రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఎన్నికలు, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అన్నీ ఇలా ఈ సినిమాను హోల్డ్ చేసాయి. దీనిపై ఎన్నో అనుమానాలు ఉన్న తరుణంలో హరీష్ శంకర్.. రవితేజ తో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాను లైన్ లో పెట్టి దాదాపుగా పూర్తి చేసాడు.
ఈ సినిమాకు సంబంధించి ఎక్స్‌ప్లోజివ్ టీజర్‌ను ఆదివారం విడుదల చేసిన సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడాడు. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) సినిమా విడుదల అవుతుందా లేదా అని ఫాన్స్ అడుగుతున్నారు అంటే… దాని గురించి నేను నేరుగా ఫాన్స్ తో మాట్లాడతా అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఇక సినిమా ఎందుకు ఆలస్యం అయింది అంటే… కరోనా కొంత గ్యాప్ ఇచ్చిందని… అలాగే పవన్ కల్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతోనే సినిమా లేట్ అయిందని… అందుకే మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేశా అని ఈ క్రేజీ డైరెక్టర్ సమాధానం ఇచ్చాడు.