HARISH RAO BUDGET: తెలంగాణ 2023-24 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఏ ఏ శాఖకు ఎన్ని కోట్లు క్లుప్తంగా
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ముందుగా మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి బడ్జెట్ కాపీలతో చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. శాసన సభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అని హరీష్ తెలిపారు. దేశంలో అత్యధికంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ 2023 – 24 బడ్జెట్‌ను 2,90,396 కోట్లతో ప్రవేశపెడుతున్నారు. ఇందులో తలసరి ఆదాయం3,17,215కోట్లు కాగా.. మూలధన వ్యయం 37, 525 కోట్లుగా తెలిపారు.
బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. వ్యవసాయానికి, నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. వ్యవసాయరంగానికి రూ. 26,831 కోట్లు కాగా నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు.. విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లుగా తెలిపారు. ..
తెలంగాణలో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
రుణమాఫీ కోసం 6385 కోట్లు,
రైతు బంధు – 1575 కోట్లు,
రైతు భీమా – 1589 కోట్లు,
విద్యుత్ సబ్సిడీ – 12000 కోట్లు,
బియ్యం సబ్సిడీ – 2000 కోట్లు
సంక్షేమ పథకాల విషయానికొస్తే..
కల్యాణలక్ష్మి – 2000 కోట్లు
కెసీఆర్ కిట్ – 200 కోట్లు
ఆసరా పెన్షన్లు – 12000 కోట్లు
స్కాలర్షిప్‌ల కోసం – 5609 కోట్లు
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి – 4834 కోట్లు
డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం- 12000 కోట్లు
ఎస్పీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
ఆరోగ్యశ్రీ – 1463 కోట్లు
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
SDF – 10348 కోట్లు
CDP – 800 కోట్లు
ఇరిగేషన్ – 10014 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
గ్రామాల్లో రోడ్ల కోసం 2వేల కోట్లు
ఆర్ అండ్ బీ రోడ్ల కోసం 2,500 కోట్లు
తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వీటితో పాటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ధ్యేయంగా కూడా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ మెట్రోకు- 1500 కోట్లు
పంచాయతీ రాజ్ – 2587 కోట్లు
హైదరాబాద్ మెట్రోకు- 1500 కోట్లు
గొర్రెల పెంపకం కోసం రూ.100 కోట్లు