Harish Rao: సిద్ధిపేటలో హరీష్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు..

ఏ స్థాయి నేతలు పార్టీ మారారు అనే చర్చ ఎలా ఉన్నా.. హరీష్ ఇలాఖాలో బీఆర్ఎస్‌కు ఇలాంటి షాక్‌ తగలడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సిద్ధిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 03:40 PMLast Updated on: Apr 04, 2024 | 7:02 PM

Harish Rao Cadre From Siddipet Brs Joining In Congress

Harish Rao: సిద్ధిపేట.. బీఆర్ఎస్‌కు కంచుకోట. మెజారిటీ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్‌ రావు.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఓటమి అనేదే లేకుండా సాగుతున్నారు. సరైన ప్రత్యర్థులు కూడా లేరంటే.. అక్కడ హరీష్ రావు హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిద్ధిపేటలో మొదటిసారి.. బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. హరీష్ అనుచరులు, సిద్ధిపేటలో కీలకంగా ఉన్న నేతలు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

GOLD PRICES: పసిడి పరుగు.. మిడిల్‌ క్లాస్‌కు బంగారం ఇక కలేనా..?

ఏ స్థాయి నేతలు పార్టీ మారారు అనే చర్చ ఎలా ఉన్నా.. హరీష్ ఇలాఖాలో బీఆర్ఎస్‌కు ఇలాంటి షాక్‌ తగలడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సిద్ధిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో.. 7, 20, 37వ వార్డుల కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి, రియాజుద్దీన్‌, సాకి బాల్‌లక్ష్మి.. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్‌ వాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి సురేఖ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొందరు కౌన్సిలర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని.. త్వరలోనే సిద్దిపేట బల్దియాలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని.. జంపింగ్ కౌన్సిలర్లు ధీమాగా చెప్తున్నారు.

ఇక అటు రేవంత్.. ఆ నేతలను ఆప్యాయంగా పలకరించారు. ఎప్పుడైనా, ఏ అవసరమైన తనను నేరుగా కలవచ్చని ధీమా ఇచ్చారని.. జంపింగ్‌ నేతలు చెప్తున్నారు. సిద్ధిపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడం అంటే.. అది హరీష్‌కు మాత్రమే కాదు, బీఆర్ఎస్‌కు కూడా భారీ షాక్‌గా మారడం ఖాయం.