Harish Rao: బీజేపీ, గవర్నర్ ఒక్కటే.. మా బిల్లులు ఎందుకు ఆగినయ్..?: హరీష్ రావు

బషీర్‌బాగ్ మీట్ ది ప్రెస్‌లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గవర్నర్ రాష్ట్ర సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. RTC విలీన బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకుండా ఆలస్యం చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దగ్గర తాను కార్యకర్తను మాత్రమేననీ.. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధమన్నారు మంత్రి హరీష్ రావు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 01:11 PMLast Updated on: Nov 15, 2023 | 1:11 PM

Harish Rao Criticised Revanth Reddy And Congress In Pressmeet

Harish Rao: బీఆర్ఎస్, బీజేపి ఒక్కటేననీ.. అందుకే గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు ఆపుతున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. బషీర్‌బాగ్ మీట్ ది ప్రెస్‌లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గవర్నర్ రాష్ట్ర సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. RTC విలీన బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకుండా ఆలస్యం చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ దగ్గర తాను కార్యకర్తను మాత్రమేననీ.. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధమన్నారు మంత్రి హరీష్ రావు.

IT RAIDS: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహితులపై ఐటీ సోదాలు.. రూ.12.5 కోట్లు స్వాధీనం..

పాజిటివ్ ఓటుతో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పాజిటివ్ ఓట్‌తోపాటు నెగిటివ్స్ కూడా ఉంటాయన్నారు. ప్రతిపక్షాలకు అసలు ఎజెండాయే లేదనీ.. అందుకే తమను తిట్టుకుంటూ బతుకుతున్నారని మండిపడ్డారు. చెప్పుతో కొట్టాలని ఓ ప్రతిపక్ష లీడర్ అన్నాడు. తమకు కూడా బూతులు వచ్చనీ.. నేను కూడా బూటుతో కొట్టాలి అని అనవచ్చని ఫైర్ అయ్యారు హరీష్. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే సుస్థిర పాలన.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే సంక్షోభ పాలన వస్తుందని హరీష్ తెలిపారు. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య రంగంతోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని.. ప్రతి నెలా 1 నుంచి 5లోపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని హరీష్ తెలిపారు. మేడిగడ్డ విషయంలో ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తునాయని విమర్శించారు. తన తెలంగాణ ఉద్యమ ఇంటిగ్రిటీపై మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి లేదన్నారు. తనపైనా 200 ఉద్యమ కేసులు నమోదైనట్టు హరీష్ చెప్పారు.