Harish Rao: కౌశిక్ రెడ్డితోనే హుజురాబాద్ అభివృద్ధి.. ఒక్క అవకాశం ఇవ్వండి: మంత్రి హరీష్ రావు

హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయి. కాంగ్రెస్‌కు రెండవ స్థానం.. బిజెపి మూడో స్థానానికి పడిపోయింది. కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 10, 2023 | 07:12 PMLast Updated on: Nov 10, 2023 | 7:12 PM

Harish Rao Road Show In Huzurabad Asked People To Vote Padi Kaushik Reddy

Harish Rao: హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ (brs) అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (PADI KAUSHIK REDDY)కి ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు (Harish Rao) కోరారు. కౌశిక్ రెడ్డితోనే హుజురాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. శుక్రవారం జమ్మికుంటలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి.. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు.

TELANGANA CONGRESS: బీసీ జపం మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. బీసీలపై హామీల వర్షం..

అనునిత్యం ప్రజల కోసం తాపత్రయపడే ముఖ్యమంత్రి ఉండడం మనందరి అదృష్టమని అన్నారు. “కాంగ్రెస్, బిజెపి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచిన తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల కోసం కొత్త మేనిఫెస్టో తయారు చేశారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షల పెంచారు. గ్యాస్ సిలిండర్ను కూడా కేవలం రూ.400కి అందిస్తామన్నారు. కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీలకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాల మేనిఫెస్టో గొప్పగా ఉంది. హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత పట్టాలు కూడా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి కర్ణాటకలో రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదా..? తెలంగాణలో కెసిఆర్ చెప్పినవన్నీ చేశారు. హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయి. కాంగ్రెస్‌కు రెండవ స్థానం.. బిజెపి మూడో స్థానానికి పడిపోయింది.

కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారు. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. మేమంతా తన వెంట ఉంటాం. ఉప ఎన్నికల సమయంలో ఇక్కడ ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి గెల్లు శ్రీనివాస్‌ని ఆదరించి టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చారని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్ గెలిచిన అనంతరం ఈ నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడ ప్రజలను కూడా పూర్తిగా విస్మరించారు. ఇప్పటికైనా ప్రజలు న్యాయం, ధర్మం ఆలోచించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కౌశిక్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలి. రైతులను బిచ్చగాళ్ళతో పోల్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.