HARISH RAO VS REVANTH: రాజీనామా హైడ్రామా.. రేవంత్ వర్సెస్ హరీష్..
రేవంత్.. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగస్టు 15లోపు కచ్చితంగా రుణ మాఫీ చేస్తామన్నారు. అలా చేస్తే బీఆర్‌ఎస్ నేతలు.. ముఖ్యంగా హరీష్ రావు రాజకీయల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. దీనికి స్పందనగా హరీష్ రావు.. శుక్రవారం గన్‌పార్కు వద్దకు వచ్చారు.
HARISH RAO VS REVANTH: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఆగష్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. తాను కూడా ముందుగా రాజీనామా చేస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ఈ హామీ నెరవేర్చలేదు. దీనిపై బీఆర్ఎస్.. పదేపదే కాంగ్రెస్‌ను ప్రశ్నించింది.
Whatsapp Bundh in India: అలాగైతే… ఇండియాలో వాట్సాప్ సేవలు బంద్ !
దీనిపై ఇటీవల స్పందించిన రేవంత్.. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగస్టు 15లోపు కచ్చితంగా రుణ మాఫీ చేస్తామన్నారు. అలా చేస్తే బీఆర్‌ఎస్ నేతలు.. ముఖ్యంగా హరీష్ రావు రాజకీయల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. దీనికి స్పందనగా హరీష్ రావు.. శుక్రవారం గన్‌పార్కు వద్దకు వచ్చారు. ఆగష్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. చేయకుంటే రేవంత్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అంతేకాదు.. హరీష్ రావు రాజీనామా లేఖ కూడా ఇచ్చారు. తన ఛాలెంజ్ స్వీకరించి రేవంత్ కూడా రాజీనామా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ బిజీగా ఉంటే.. తన సిబ్బందితోనైనా రాజీనామా పత్రాన్ని పంపించాలని సూచించారు. ఆగస్టు 15 లోపు ఏక కాలంలో ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయాలని, లేకుంటే రాజీనామాలు ఆమోదించుకొని రాజకీయాల నుంచి తప్పుకోవాలని హరీష్ సవాల్ చేశారు. రైతుల రుణమాఫీ కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. రేవంత్ రెడ్డి సిద్ధమా కాదా అనేది తేలాలన్నారు. అయితే, హరీష్ రావు వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. సీఎం రేవంత్ కూడా స్పందించారు. హరీశ్‌రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకున్న ప్రతిసారీ హరీష్ రావుకు స్తూపం గుర్తొస్తుందన్నారు. ఆయన సవాల్‌ను స్వీకరించినట్లు చెప్పారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పానని, ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుందన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా అని హరీష్‌ను ప్రశ్నించారు. “రుణమాఫీకి రూ.30-40వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా? స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.