10 కోట్లు ఇస్తారు, బెట్టింగ్ యాప్స్ ఆపను: హర్షా సాయి ఆడియో లీక్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం చెలరేగినట్టు ఇప్పుడు ఓ ఆడియో సంచలనంగా మారింది. వివాదానికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ పై దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు వాదించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 01:41 PMLast Updated on: Sep 28, 2024 | 1:41 PM

Harsha Sai Audio Viral About Betting Apps

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం చెలరేగినట్టు ఇప్పుడు ఓ ఆడియో సంచలనంగా మారింది. వివాదానికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ పై దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు వాదించారు. దీంతో ఆ ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుంది అని బాధితురాలు వాదించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలని బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం చెలరేగింది.

లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించగా… నిషేధించిన బెట్టింగ్ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్లయినా ఇస్తారు అని ఆడియోలో హర్ష సాయి చెప్పడం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లయినా తీసుకుంటానని హర్ష సాయి చెప్పడం గమనార్హం. తాను కాకపోతే మరో పదిమందితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారు అంటూ హర్ష వ్యాఖ్యలు చేసాడు. తాను కచ్చితంగా ప్రమోషన్స్ చేయాలి అవి నా మార్కెట్ పెంచుతాయి హర్ష సాయి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను హర్ష సాయి సమర్ధించుకోవడం గమనార్హం.