హమ్మయ్యా.. బతికిపోయా SRHలోకి ఎంట్రీపై హర్షల్ పటేల్

టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా... ఐపీఎల్ లాంటి మెగా లీగ్ లో అయితే బ్యాటర్ల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు.. ముఖ్యంగా గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2024 | 04:25 PMLast Updated on: Dec 02, 2024 | 4:25 PM

Harshal Patel Comments On Srh Entry

టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా… ఐపీఎల్ లాంటి మెగా లీగ్ లో అయితే బ్యాటర్ల విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు.. ముఖ్యంగా గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. సన్ రైజర్స్ బ్యాటర్ల ధాటికి పలు రికార్డులు గల్లంతయ్యాయి. లీగ్ లోనే అత్యధిక స్కోరు కూడా నమోదైంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటేనే 2024 సీజన్ లో ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయారు. క్లాసెన్, హెడ్ లాంటి విధ్వంకర హిట్టర్ల దెబ్బకు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ సారి మెగావేలంలో పలువురు బౌలర్లు సన్ రైజర్స్ ఆడాలని కోరుకున్నారు. అప్పుడే సన్ రైజర్స్ బ్యాటర్లకు బౌలింగ్ చేసే ప్రమాదం నుంచి తప్పించుకుంటామని వారంతా అనుకుంటున్నారు.

తాజాగా . భారత జట్టు బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. వేలంలో తనను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనడంతో చాలా రిలీఫ్ గా ఉందన్నాడు. ఆ జట్టు తరుపున బౌలింగ్ చేయడం కష్టమన్నాడు. గత సీజన్ లో SRH బ్యాటర్లు బ్యాటర్లు విధ్వంసం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందని గుర్తు చేశాడు. ఇక ఆ టీమ్ కి ఆడటం తనకు బిగ్ రిలీఫ్ ఇస్తుందని హర్షల్ పటేల్ వ్యాఖ్యానించాడు. పంజాబ్ కింగ్స్ కి ఆడిన హర్షల్ ను వేలంలో 8 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకున్న హైదరాబాద్ అర్షదీప్, పంత్ వంటి ప్లేయర్లను కొనేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ ను వేలంలోకి వదిలేసిన SRH అతని స్థానంలో షమీతో పాటు
హర్షల్ పటేల్ ను తీసుకుంది.

45 కోట్ల తక్కువ మొత్తంతో వేలంలో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఆటగాళ్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. జట్టులో ఇప్పటికే క్లాసేన్ రూపంలో వికెట్ కీపర్ అందుబాటులో ఉండగా.. ఇషాన్ మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. సిమర్జీత్ సింగ్‌ను కోటిన్నరకు, జయదేవ్ ఉనద్కత్‌ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్సేను కూడా కోటి రూపాయలకు సొంతం చేసుకుంది.రాహుల్ చాహర్ , ఆడమ్ జంపా,జీషన్ అన్సారీ రూపంలో ముగ్గురు స్పిన్నర్లను సన్‌రైజర్స్ వేలంలో కొనుగోలు చేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ మనోహర్‌ కోసం ఆరెంజ్ ఆర్మీ ఏకంగా 3.20 కోట్లు ఆఫర్ చేసింది. అభినవ్‌కు మంచి హిట్టర్‌గా పేరుంది.