Hardik Lover : హార్థిక్.. మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..
కమ్‌బ్యాక్ ఇస్తే హార్ధిక్‌లా ఇవ్వాలంటూ.. ఈ మధ్య సోషల్‌మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. ఎక్కడయితే అవమానాలు ఎదుర్కున్నాడో.. ఒక్కడే జనాలతో అరుపులు అరిపించాడు హార్ధిక్.
కమ్‌బ్యాక్ ఇస్తే హార్ధిక్‌లా ఇవ్వాలంటూ.. ఈ మధ్య సోషల్‌మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. ఎక్కడయితే అవమానాలు ఎదుర్కున్నాడో.. ఒక్కడే జనాలతో అరుపులు అరిపించాడు హార్ధిక్. ఏ నోళ్లు అయితే హార్థిక్‌ను తిట్టాయో.. అదే నోళ్లు ఇప్పుడు సారీ చెప్తున్నాయ్. వాల్డ్‌కప్ లాస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా కాదు.. నిజమైన లీడర్‌గా, క్రికెటర్‌గా, వ్యక్తిగా హార్ధిక్.. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా మారాడు. ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి హార్థిక్‌కు కష్టాలు స్టార్ట్ అయ్యాయ్. రీసెంట్ ఐపీఎస్ సీజన్‌లో.. హార్ధిక్ అన్నరకాలుగా ఫెయిల్ అయ్యాడు.
ఆ తర్వాత భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడనే గాసిప్స్.. హార్ధిక్‌కు మరింత ఇబ్బందిగా మారాయ్. ఐతే నటాషా మాటలు కూడా.. పెళ్లి పెటాకులు అయినట్లేనని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఇలాంటి పరిణామాల మధ్య వాల్డ్‌కప్.. హార్ధిక్ ఫేట్‌ను మార్చేశాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు మరో న్యూస్.. సోషల్ మీడియాలోసర్కిల్ అవుతోంది. అదే.. హార్థిక్ మళ్లీ ప్రేమలో పడ్డాడని! హార్దిక్ ఈ మధ్య.. ఓ అమ్మాయితో ఫోటో దిగాడు. పైజామా, కాటన్ కుర్తా ధరించిన హార్దిక్… పోల్కా డాటెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భుజంపై చేయి వేసి ఫొటోలకు పోజులిచ్చాడు. హార్దిక్‌ని చూసి ఆ అమ్మాయి సిగ్గుపడుతుండగా.. అతను మాత్రం ఆమె వైపు అదో మాదిరి లుక్ ఇచ్చాడు.
దీంతో ఆ ఫొటో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. హార్ధిక్ ప్రేమలో పడ్డాడని కొందరు డిసైడ్ చేసేస్తుంటే.. అమ్మాయి ముద్దుగా ఉంది పెళ్లి చేసుకో బాస్ అంటూ ఇంకొందరు సలహా ఇస్తున్నారు. ఐతే ఈ ఫొటో వెనక అసలు కథ.. లేటెస్ట్‌గా బయటకు వచ్చింది. ఆమె జస్ట్.. హార్థిక్‌కు ఫ్యాన్ మాత్రమే. వాల్డ్‌కప్ నెగ్గిన తర్వాత.. ఫ్యాన్స్ మీట్ పెట్టాడు హార్ధిక్. ఆ మీటింగ్‌కు ఆ అమ్మాయి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసమో.. ఓ మెమొరీగా ఉండాలనో కానీ.. హార్థిక్‌తో క్లోజ్‌గా ఉంది. ఎలాగూ ఫ్యాన్ కాబట్టి.. ప్రేమ చూపించింది. ఇక్కడే కెమెరాలు క్లిక్‌మన్నాయ్. ఇక ఆ తర్వాత మొదలైందే ఈ రచ్చ అని మరికొందరు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ జోడి మాత్రం క్యూట్‌గా ఉందని ఇంకొందరి కామెంట్.