Haryana CM Khattar Resign: హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా… జేజేపీతో విభేదాలు !
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందువల్లే సీఎం ఖట్టార్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Haryana CM Khattar Resign: హరియానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రిజైన్ లెటర్ సమర్పించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది. కొత్త సీఎంను కూడా ఇవాళే ఎన్నుకుంటారని చెబుతున్నారు. బీజేపీ, జననాయక్ జనతా పార్టీతో (Jananaik Janatha party) కలసి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు JJP కి గుడ్ బై చెప్పిన బీజేపీ.. ఇండిపెండెంట్లతో కలసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోంది.
JANASENA SEATS : చివరకు మిగిలింది 21
హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందువల్లే సీఎం ఖట్టార్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)కి 10 మంది, కాంగ్రెస్‌కు 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోక్ దళ్, హరియాణా లోక్‌హిత్ పార్టీకి చెరొక సభ్యుడు ఉన్నారు. ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇండిపెండెంట్లతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. దాంతో ఖట్టార్ సర్కార్ లో దుష్యంత్ తో పాటు ఉన్న మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. జేజేపీ వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. నలుగురు JJP ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. జేజేపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు హిస్సార్, భివానీ సీట్లను జేజేపీ కోరుతుంది. కానీ బీజేపీ మాత్రం అన్ని సీట్లల్లో తామే పోటీ చేస్తామనడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అంతేకాకుండా.. హిస్సార్‌లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఈనెల 13న జేజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఖట్టర్ ను లోక్ సభ ఎన్నికల్లో నిలబెడతారని తెలుస్తోంది. దాంతో హరియానా తర్వాత ముఖ్యమంత్రిగా నయబ్ సైనీ, సంజయ్ భాటియాల్లో ఎవరికైనా అవకాశం దక్కవచ్చు. ఖట్టరే మరోసారి సీఎంగా ప్రమాణం చేస్తారని కూడా బీజేపీ లీడర్లు చెబుతున్నారు.