Aishwarya : అభిషేక్‌తో ఐశ్వర్య విడిపోయిందా.. అంబానీ పెళ్లిలో దూరం అందుకేనా..
అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. వేల కోట్ల ఖర్చుతో... ముంబై వీధుల్లో ఓ రేంజ్‌తో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇండియాలోని పాపులర్ యాక్టర్లంతా దాదాపుగా వచ్చేశారు.

Has Aishwarya broken up with Abhishek? Is that why the distance in Ambani's wedding?Has Aishwarya broken up with Abhishek? Is that why the distance in Ambani's wedding?
అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. వేల కోట్ల ఖర్చుతో… ముంబై వీధుల్లో ఓ రేంజ్‌తో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఇండియాలోని పాపులర్ యాక్టర్లంతా దాదాపుగా వచ్చేశారు. టాలీవుడ్ నుంచి మహేష్, రాంచరణ్‌తో పాటు బిగ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ పెళ్లికి అమితాబ్ ఫ్యామిలీ కూడా హాజరయింది. ఐతే పెళ్లి వేదిక సాక్షిగా.. ఆ కుటుంబంలో కలహాలు బయటపడినట్లు అయిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోయారనే డిస్కషన్ కూడా వినిపిస్తోంది. అనేకమంది స్టార్స్.. తమ కుటుంబాలతో వచ్చారు. ఐతే బచ్చన్ ఫ్యామిలీ మాత్రం వేరేగా వచ్చింది. ఇదే ఆ డిస్కషన్‌కు ప్రధాన కారణంగా మారింది.
ఐశ్వర్య సినిమాలు తగ్గించాక.. బచ్చన్ ఫ్యామిలీతోనే కలిసి ఉంటోంది. ఐతే పెళ్లిలో మాత్రం ఆమె వేరేగా కనిపించడం.. ప్రతీ ఒక్కరిని షాక్కు గురి చేసింది. కూతురు, అల్లుడు, మనవరాలుతో కలిసి అమితాబ్, జయా ఫొటోలు దిగారు. అభిషేక్ కూడా వారితోనే ఉన్నారు. ఐతే అక్కడ ఐశ్వర్య మిస్ అయింది. కూతురు ఆరాధ్యతో కలిసి అదే పెళ్లిలో ఐశ్వర్య వేరుగా ఫొటో దిగింది. దీంతో ఒకే కుటుంబం అయినా.. వీరంతా ఇప్పుడు విడివిడిగా రావడంపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. నిజంగా వీరి కుటుంబంలో కలహాలు ఉన్నాయా.. లేదంటే వారు ముందు వచ్చి.. ఈమె ఆలస్యం అయిందా అనే చర్చ జరుగుతోంది.
ఎంత లేట్ అయినా కూడా ఇలాంటి పెద్ద కుటుంబం నుంచి… విడిగా రావడం అంటే అనుమానించాల్సిందే అన్నది చాలామంది మాట. దూరం కావాలనే దూరంగా ఉన్నారా.. పెళ్లిలో దూరం చెప్పింది అదేనా అనే డిస్కషన్ జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. బచ్చన్ ఫ్యామిలీ నుంచి రావాల్సిందే. ఐతే మరికొందరు మాత్రం.. ఫొటోల్లో లేనంత మాత్రాన కుటుంబంలో లేనట్లు కాదని… విడివిడిగా ఉన్నా.. ఐశ్వర్య, అభిషేక్ మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయంటూ పోస్టులు పెడుతున్నారు.