T Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పక్కన పెట్టిన హస్తం పార్టీ..?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో బీసీల వివాదం చిలికి చిలిక గాలివానలా మారే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఆ పార్టీ ఉదయ్‌పూర్ లో ప్రకటించిన డిక్లరేషన్. ఇది తెలంగాణలో అమలు కావడం లేదంటూ పట్టుబడుతున్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఆచీ చూచి అడుగువేస్తోంది. ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో కూడా సీపీఐ, సీపీఎం లకు రెండేసి చోప్పున 4 స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. అప్పుుడు మిగిలినవి 15 మాత్రమే. వీటిలో కూడా తుంగతుర్తి లాంటి ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే బీసీలకు చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా గతంలో ఉదయ్‌పూర్ వేదికగా చెప్పిన హామీ ఒట్టిమాటలే అనే భావన నేతల్లో రేకెత్తుతోంది.
ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి..
గతంలో చాలా సార్లు సమావేశాల తరువాత కాంగ్రెస్ తొలిజాబితా విడుదల చేసింది. అందులో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, పోన్నాల లక్ష్మయ్యకు టికెట్ కేటాయించడంలో జాప్యంతో పాటూ అలక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు ప్రకటించిన 100 సీట్లలో కేవలం 20 మంది బీసీలు ఉన్నారు. గతంలో చెప్పినట్లు నియోజకవర్గానికి రెండు బీసీలను కేటాయిస్తే.. తెలంగాణలో ఉన్నది 17 పార్లమెంట్ స్థానాలు. మొత్తం 34 మంది బీసీలకు అవకాశం కల్పించాలి. ఒకసారి పూర్తి లెక్కలు చూస్తే.. 119 స్థానాలకు గానూ ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాల ప్రకారం 31 సీట్లు కేటాయించాలి. 119 లో 31 పోతే మిగిలినవి 88 స్థానాలు. బీసీలకు లోక్ సభ నియోజకవర్గానికి రెండు చొప్పున వేసుకుంటే 34 సీట్లు కేటాయించాలి. మిగిలిన 88 స్థానాల్లో 34 బీసీ సీట్లు పోగా మిగిలినవి 54 నియోజకవర్గాలు జనరల్ అభ్యర్థులకు కేటాయించాలి. ఇప్పటి వరకూ బీసీలకు 19 కేటాయించారు. ఇక ఇప్పుడు మిగిలిన 19 సీట్లలో 15 స్థానాలు బీసీలకు కేటాయిస్తే చెప్పిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అయితే అలా జరగడం లేదు. దీంతో బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ డిక్లరేషన్ అమలు అవుతుందా..?
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన బీసీలకు ఎన్నిలకల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకూడదు. అయితే గతంలో రెండు సార్లు కాంగ్రెస్ ఈ డిక్లరేషన్ ను పక్కన పెట్టింది. 2018 కోదాడ, 2019 ఉపఎన్నికల్లో హుజూర్ నగర్ విషయంలో ఒకే కుటుంబంలోని వారికి టికెట్లు కట్టబెట్టింది. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన కుమారుడి విషయంలో కూడా ఇదే దోరణిని అవలంభించింది. అయితే వరంగల్ నుంచి పోటీకి దిగిన కొండా దంపతుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొండా మురళీకి టికెట్ ఇవ్వకుండా సురేఖకు కేటాయించారు. ఇలా చేయడం పట్ల కొందరితో ఒక విధంగా మరి కొందరు నాయకులతో ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతుందని భావిస్తున్నారు సీనియర్ నాయకులు. దీని ప్రభావం ఎన్నికల్లో తప్పకుండా పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.
T.V.SRIKAR