బెయిల్స్ మార్చాడు..వికెట్ పడింది, సిరాజ్ ట్రిక్ వర్కౌట్ అయిందిగా
క్రికెట్ లో బ్యాటర్ల ఏకాగ్రతను చెడగొట్టేందుకు బౌలర్లు, ఫీల్డర్లు ఏదోటి చేస్తుంటారు... అలాగే క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతుంటారు... వికెట్లపై బెయిల్స్ మారిస్తే బ్యాటర్ ఔట్ అవుతాడన్న నమ్మకంగా చాలా బౌలర్లలో ఉంటుంది.. ఇటీవల గబ్బా టెస్టులో ఇలాంటి సీన్ జరిగింది...
క్రికెట్ లో బ్యాటర్ల ఏకాగ్రతను చెడగొట్టేందుకు బౌలర్లు, ఫీల్డర్లు ఏదోటి చేస్తుంటారు… అలాగే క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతుంటారు… వికెట్లపై బెయిల్స్ మారిస్తే బ్యాటర్ ఔట్ అవుతాడన్న నమ్మకంగా చాలా బౌలర్లలో ఉంటుంది.. ఇటీవల గబ్బా టెస్టులో ఇలాంటి సీన్ జరిగింది… అప్పుడు లబూషేన్ ఔటైతే… తాజాగా బాక్సింగ్ డే టెస్టులోనూ బెయిల్స్ ఛేంజ్ చేసే సీన్ రిపీటయింది. మరోసారి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ట్రిక్ తోనే ఆసీస్ బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీశాడు. ఫలితంగా కీలక వికెట్ ను కంగారూలు చేజార్చుకున్నారు. మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగినప్పటి నుంచి ఆ జట్టు యువ ఓపెనర్ శామ్ కొంటాస్ జోరుతో కంగారూలు స్కోర్ దూకుడుగా సాగింది. తొలి రోజు ఆస్ట్రేలియా నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
బూమ్రాతో సహా మిగిలిన బౌలర్లు ఒకదశలో వికెట్లు తీయలేక వెనుకబడ్డారు. కానీ సిరాజ్ చేసిన ట్రిక్ తో బుమ్రాకు వికెట్ దక్కింది. మహ్మద్ సిరాజ్ ఒక ప్రత్యేకమైన ట్రిక్ ప్లే చేశాడు. ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతికి ముందు మహ్మద్ సిరాజ్ స్ట్రైకర్స్ ఎండ్‌కు వెళ్లి బెయిల్స్ మార్చాడు. దీని తర్వాత ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ 45వ ఓవర్ తొలి బంతికి భారత పేసర్ బుమ్రాకు బలయ్యాడు. బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించిన ఖవాజా పుటైమింగ్ కుదరకపోవడంతో షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరాజ్ బెయిల్ ఛేంజ్ ట్రిక్ మళ్ళీ వర్కౌట్ అయిందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
గబ్బా టెస్టులోనూ సిరాజ్ ఇదే ట్రిక్ తో లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు. క్రీజులో పాతుకుపోయిన లబుషేన్ గురించి తెలిసే.. సిరాజ్ బెయిల్స్ మార్చే ట్రిక్ ప్రయోగించాడు. వాస్తవానికి అలా బెయిల్స్ మార్చడం వల్ల సిరాజ్‌కి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. స్టంప్స్‌పై ఉండే బెయిల్స్ రెండూ సమానమే. కానీ.. బ్యాటర్ల ఏకాగ్రతని దెబ్బతీయడానికి సిరాజ్ ఆ పని చేశాడు. అతను ఆశించినట్లే.. ఆసీస్ బ్యాటర్లు అతని బుట్టలో పడ్డారు. అప్పటి వరకూ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టిన వారు ఒక్కసారి ఫోకస్ చెదిరి తర్వాతి ఓవర్లోనే ఔటయ్యారు.