CIVILS FAILURE : సివిల్స్ లో పోరాడి ఓడాడు ! కంటతడి పెట్టిస్తున్న కునాల్ ట్వీట్..
సివిల్స్ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలానా అతనికి ఫస్ట్ ర్యాంక్... ఫలానా ఆమెకు థర్డ్ ర్యాంక్... అతను అలా చదవాడట... ఈమె ఇలా ప్రిపేర్ అయిందట ... అని అందరూ చెప్పుకుంటున్నారు.
సివిల్స్ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలానా అతనికి ఫస్ట్ ర్యాంక్… ఫలానా ఆమెకు థర్డ్ ర్యాంక్… అతను అలా చదవాడట… ఈమె ఇలా ప్రిపేర్ అయిందట … అని అందరూ చెప్పుకుంటున్నారు. ఛానెళ్ళు, సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో ఇంటర్వ్యూలు రెండు రోజులుగా ఇదే హడావిడి. కానీ వీళ్ళందరికంటే కునాల్ ఆర్. విరూల్కర్ పెట్టిన ఒకే ఒక్క పోస్టు… వైరల్ అయింది. అలా… ఇలా కాదు.. ఏకంగా 27 లక్షల మంది చూశారు. వేల మంది అతనికి రిప్లయ్ ఇస్తున్నారు. సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన ఆదిత్య శ్రీవాస్తవ కన్నా కునాల్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ట్వీట్ తో అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాడు. ఇంతకీ ఏంటా వైరల్ ట్వీట్…
12 అటెంప్ట్స్… అందులో 7 మెయిన్స్… 5 ఇంటర్వ్యూలు… నో సెలక్షన్… బహుశా పోరాటం అనేది జీవితానికి మరో పేరేమో… అంటూ X లో ట్వీట్ చేశాడు కునాల్. ఫస్ట్ జనరేషన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కునాల్ పెట్టిన ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. దీనికి 27 లక్షల వ్యూస్ వచ్చాయి… 31 వేల మంది లైక్ చేస్తే… నాలుగున్నర వేల మంది రీట్వీట్ చేశారు. ఇంకా ఈ ట్వీట్ పై వేల మంది రెస్పాండ్ అవుతున్నారు. కునాల్ కి ఊహించని విధంగా నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది… వేలమంది అతనికి ధైర్యం చెబుతున్నారు.
మీ పేరు సివిల్స్ అభ్యర్థుల లిస్టులో చూడాలనుకున్నారు. కానీ జీవితంలో అంతకంటే పెద్ద విజయాన్ని మీరు అందుకుంటారేమో…. మీ పట్టుదల, పోరాటం గురించి వివరించడానికి మాటలు రావట్లేదు…. మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం… మీరెప్పుడూ గెలుస్తూనే ఉంటారు… అంటూ ఒక నెటిజన్ స్పదించారు. మీ పోరాట జీవితంలో మీకు ఏది దక్కాలే అదే దక్కుతుంది… కంగ్రాట్స్ అని మరొకరు కునాల్ కి ధైర్యం చెప్పారు. మీ చిరునవ్వు ఇంకా ఎందరికో శక్తి ఇస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కునాల్ నువ్వొక స్ఫూర్తి… ఆగకు, గెలిచేదాకా… ఓడిపోయానని ఆగిపోకు… ఈ మోటివేషనల్ వాక్యానికి నువ్వే ఓ ఉదాహరణ అంటూ ఓ జర్నలిస్ట్ స్ఫూర్తి నింపాడు.
ఇలా 12సార్లు సివిల్స్ లో ఓడిపోయానని చెప్పిన కునాల్ కు సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు పలుకుతున్నారు నెటిజన్స్ కొసమెరుపు ఏంటంటే… ప్రధాని నరేంద్రమోడీ … కునాల్ ట్వీట్ చూశారో… చూడలేదో తెలియదు గానీ… సివిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అపజయాలు కఠినంగానే అనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి… మీ ప్రయాణానికి ఇదే ముగింపు కాదు… పరీక్షల్లో నెగ్గే అవకాశాలు ముందు ముందు ఇంకా ఉంటాయని… వీటికి మించి మన దేశం మరెన్నో అవకాశాలకు వేదికగా నిలుస్తుంది… మీరు మరెన్నో అవకాశాల కోసం అన్వేషించండి… కష్టపడండి అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. పట్టువదలని విక్రమార్కుడిలా సివిల్స్ కోసం ప్రయత్నించి కునాల్ విఫలమైనా…అతని పోరాటా స్ఫూర్తికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు. అందుకే సివిల్స్ విజేతల కంటే… కునాల్ ట్వీట్ కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి.
12 attempt
7 main
5 interviewNO SELECTION.
शायद जिंदगी का दूसरा नाम ही संघर्ष हैं ।#UPSC #यूपीएससी pic.twitter.com/FEil9NGJ5l
— Kunal R. Virulkar 📝 குணால் (@kunalrv) April 16, 2024