Gautam Gambhir : గంభీర్ ను భయపెట్టిన బ్యాటర్ అతడే…
ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా తనను భయపెట్టిన బ్యాటర్ గురించి వెల్లడించాడు.

He is the batter who scared Gambhir...
ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా తనను భయపెట్టిన బ్యాటర్ గురించి వెల్లడించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు. గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ కాదనీ. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను రోహిత్ శర్మ గురించే ఎక్కువ భయపడినట్టు తెలిపాడు.అతను బరిలో ఉన్నాడంటే ప్లాన్-ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్దం చేసుకునేవాడిననీ వెల్లడించాడు. రోహిత్ శర్మను ఆపడం అంత సులువైన పనికాదన్న గంభీర్ అతడి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలను ఉంచుకోవాల్సిందే అన్నాడు.
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్ (Gautam Gambhir).. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు. కెప్టెన్‌గా కేకేఆర్ (KKR) ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ (BJP) ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని కోల్ కత్తా జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.