వచ్చే ఐపీఎల్ సీజన్ లో పలు జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా పలువురు స్టార్ క్రికెటర్ల పేర్లు ఆయా జట్ల కెప్టెన్ల రేసులో వినిపిస్తున్నాయి. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి సరికొత్తగా కనిపించబోతోంది. వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆర్సీబీ యువ, సీనియర్ ఆటగాళ్ళతో జట్టును రెడీ చేసింది. అయితే కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. తాజాగా బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కొత్త కెప్టెన్ గా ఎవరికి అవకాశం ఉందనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఫ్రాంచైజీ వర్గాల అభిప్రాయం ప్రకారం జట్టులో యువ ఆటగాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పాడు. కానీ కెప్టెన్సీ పగ్గాలు సీనియర్ ప్లేయర్ కే అప్పగిస్తారన్న ప్రచారంపైనా స్పందించాడు. కెప్టెన్సీ విషయంలో ఇంకా పూర్తిస్థాయి డిస్కషన్స్ జరగలేదన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని రివీల్ చేశాడు. జట్టు కూర్పుపై ఆండీ ఫ్లవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు. ఆండీ ఫ్లవర్ కామెంట్స్ ను చూస్తే కోహ్లీని మళ్ళీ కెప్టెన్ గా చూసే ఛాన్సుంది. ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్‌మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడం విరాట్ ను బాగా బాధపెట్టింది. ఆ తర్వాత కూడా ఆర్సీబీ చెప్పుకోదగ్గ విజయాలను అందుకోలేకపోయింది. దీంతో కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న కోహ్లీ 2021లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత సౌతాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. గత ఏడాది మెగావేలంలో డుప్లెసిస్ ను ఆర్సీబీ రిలీజ్ చేయడంతో ఇప్పుడు కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది.[embed]https://www.youtube.com/watch?v=z33WcZ469Kw[/embed]