Phone Tapping : హార్డ్‌డిస్క్ ధ్వంసం చేయమన్నది ఆయనే.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు సంచలనం..
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మెడకు.. ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఇదంతా జరిగిందని.. భుజంగరావు, రాధాకిషన్ రావు సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది.

He is the one who destroyed the hard disk.. Praneet Rao is a sensation in the tapping case..
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మెడకు.. ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఇదంతా జరిగిందని.. భుజంగరావు, రాధాకిషన్ రావు సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ రచ్చ కంటిన్యూ అవుతుండగానే.. ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రణీత్‌రావు.. తన వాంగ్మూలంతో మరో బాంబ్ పేల్చారు. 12వందల మంది ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో జడ్జిలు, రాజకీయ నేతలు, విపక్ష నేతలు, వారి కుటుంబసభ్యులతో పాటు.. మీడియా పెద్దలు, జర్నలిస్టులు కూడా ఉన్నారని వివరించారు. 8ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో ప్రణీత్‌రావు టచ్‌లో ఉండేవాడు. ప్రభుత్వం అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించగా.. అనధికారికంగా 5ఫోన్‌లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేవాడు. ఫోన్‌ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకొని.. విపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి డబ్బులు పట్టుకున్నామని.. ఆ మొత్తాన్ని ఎవరికీ అనుమానం రాకుండా.. హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో తెలిపాడు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని.. ఆ సంస్థ ద్వారే ట్యాపింగ్ మరింత విస్తృతం చేశామని వివరించారు. ప్రభాకర్ రావు సాయంతో 17సిస్టమ్‌ల ద్వారా ట్యాపింగ్ చేశామని.. రెండు లాగర్ రూమ్‌ల్లో 56మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు చెప్పాడు. ఐతే ఎన్నికలు ముగిసిన తర్వాత రోజు నుంచి ట్యాపింగ్ ఆపేశామని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు.. తన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు చెప్పాడు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ.. ట్యాపింగ్ సమాచారం ధ్వంసం చేయమని చెప్పాడని.. ఆయన ఆదేశాలతోనే హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు కీలక ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేసినట్లు చెప్పారు. 17 హార్డ్ డిస్క్‌ల్లో కీలకమైన సమాచారం ఉందని.. వాటన్నింటిని కట్టర్‌తో కట్ చేసి విరిచేసినట్లు చెప్పాడు. పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లలోని డేటా ఫార్మాట్ చేశామని.. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లను మూసారాంబాగ్ మూసీలో.. ఫార్మాట్ చేసిన పెన్‌డ్రైవ్‌లు బేగంపేట నాలాలో పడేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ప్రణీత్‌రావు.